ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాయంత్రం విచారణకు రండి - జోగి రమేష్​కు పోలీసుల నోటీసులు - Police Notices to Jogi Ramesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 12:07 PM IST

Updated : Aug 21, 2024, 1:22 PM IST

Police Notices to Jogi Ramesh : చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్​కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని సూచించారు. మంగళవారమే విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాకపోవడంతో డీఎస్పీ కార్యాలయం నుంచి మరోసారి నోటీసులు జారీ చేశారు.

Police Notices to Jogi Ramesh
Police Notices to Jogi Ramesh (ETV Bharat)

Police Notices to Jogi Ramesh : వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌కు పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఈరోజు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. మంగళవారమే పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. గతంలో కుమారుడి అరెస్టు కారణంగా పోలీసులు పిలిచిన రోజు కాకుండా తర్వాత విచారణకు హాజరయ్యారు. మరోవైపు నిన్న మంగళగిరి డీఎస్పీ దగ్గర విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన లాయర్లను పంపారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు తాజాగా మరోసారి నోటీసులిచ్చారు.

ఆయన విచారణకు రావడం లేదు : మాజీ మంత్రి జోగి రమేష్ నిన్న (మంగళవారం) మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరవ్వాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఇదివరకే జోగి రమేష్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిన్న మరోసారి విచారణకు రావాల్సి ఉండగా జోగి రమేష్ గైర్హాజరయ్యారు. జోగి రమేష్ తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆయన విచారణకి రావడం లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఇంటిపై దాడి కేసు - మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు జోగి రమేశ్‌ - Jogi Ramesh to Mangalagiri PS

జోగి రమేష్‌ ఫోన్‌ స్వాధీనం : కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్‌కు పోలీసులు ఈరోజు (బుధవారం) మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసుల విచారణకు హాజుకావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసు విచారణను ఓపెన్ చేసిన పోలీసులు గత శుక్రవారమే జోగి రమేష్‌ను మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో గంటన్నర పాటు విచారణ చేశారు. ఆయన ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అప్పుడు తాను చంద్రబాబు నాయుడుకి నిరసన తెలియజేసేందుకు వెళ్లాను తప్ప ఎలాంటి దాడికి యత్నించలేదని జోగి రమేశ్‌ చెప్పారు. ఆ సమయంలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబుకు తన నిరసనను తెలిపేందుకు అనుచరులతో అక్కడికి వెళ్లానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని జోగి రమేశ్‌ తెలిపారు. అయితే ఈరోజు మరోసారి విచారణకు రావాల్సిందిగా కోరడంతో మొత్తానికి చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారని తెలుస్తోంది.

ఇది ఘటన : 2021 సెప్టెంబర్ 17న ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటిపైకి జోగి రమేష్​ తన అనుచరులతో కలిసి దాడికి వెళ్లిన విషయం తెలిసిందే. అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులపైనా దాడికి తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో ఇరు వర్గాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

"అగ్రిగోల్డ్‌ భూ వ్యవహారంలోనే జోగి రాజీవ్‌ అరెస్టు- రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటు"

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు - ఫోర్జరీ కోణం గుర్తించిన ఏసీబీ - Agri gold Land Issue

Last Updated : Aug 21, 2024, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details