PM Narendra Modi Roadshow: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. విశాఖలో ప్రధాని మోదీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సిరిపురం కూడలి వద్దకు ప్రధాని మోదీ చేరుకున్నారు. సిరిపురం కూడలి నుంచి ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానం వరకు ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగింది.
రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సైతం పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మోదీని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో రోడ్ షో జరిగే మార్గం రద్దీగా మారింది.