Pawan on Govt Schemes with Names of Inspiring Providers:స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం హర్షణీయమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. విద్యాశాఖ పథకాలను సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు అభినందనలు తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో పథకాలన్నింటికీ అప్పటి ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని గుర్తుచేశారు. ఆ దుస్సంప్రదాయాన్ని పక్కనబెట్టి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే వారి పేర్లతో పథకాల అమలు మంచి పరిణామం అన్నారు. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశనం చేస్తుందన్నారు.
మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection