ETV Bharat / politics

రాజ్యాంగమంటే గౌరవం లేదు - వారంతా రాజీనామా చేయాలి: షర్మిల - YS SHARMILA PADAYATRA

రాజ్యంగం పుస్తకాన్ని పట్టుకుని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర - ఆంధ్రరత్న భవన్‌ నుంచి అంబేడ్కర్‌ స్మృతి వనం వరకు పాదయాత్ర

YS_Sharmila_Padayatra
YS Sharmila Padayatra (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 9:39 PM IST

YS Sharmila Padayatra: రాష్ట్రంలో రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ గౌరవించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి విమర్శించారు. గెలిచిన శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లాలనేది రాజ్యాంగం చెబుతోందని, కానీ వైఎస్సార్సీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లలేదని, అలాంటి వారంతా రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేడ్కర్ స్మృతి వనం వరకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షర్మిల పాదయాత్ర నిర్వహించారు. భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

జాయింట్‌ పార్లమెంట్ కమిటీ వేయాలి: రాజ్యాంగాన్ని కాపాడాలని పాదయాత్ర చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదని, అదానీని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకుంటే కనీసం విచారణ లేదని, అందరూ అదానీకి భయపడుతున్నారని ధ్వజమెత్తారు. వెంటనే విచారణ కమిటీ వేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో ఉందని, రాజ్యాంగానికి ప్రమాదం రాకుండా కాంగ్రెస్ పోరాడుతూనే ఉందని తెలిపారు. భారత రాజ్యాంగానికి బీజేపీ విలువ ఇవ్వడం లేదని, ప్రాథమిక హక్కులను విలువ లేదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో మాట్లాడితే గొంతు నొక్కుతున్నారని, విమర్శిస్తే కేసులు పెడతారని, పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు.

ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు - నేను ఇంత వరకూ ఆయన్ను చూడలేదు : షర్మిల

జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు - అదానీ ఒప్పందాలపై సమీక్షించాలి : షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.