ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి - కేంద్రంతో మాట్లాడి జూట్​మిల్ తెరిపించేందుకు కృషి చేస్తా: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Speech - PAWAN KALYAN SPEECH

Pawan Kalyan Speech at Public Meeting in Nellimarla Constituency: ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం సింగవరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లిమర్ల జూట్ మిల్ మూసివేతతో వేలమంది ఉపాధి కోల్పోయారని కేంద్రంతో మాట్లాడి మళ్లీ జూట్ మిల్ తెరిపించేందుకు కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

pawan_kalyan_speech
pawan_kalyan_speech

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 8:48 PM IST

ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి - కేంద్రంతో మాట్లాడి జూట్​మిల్ తెరిపించేందుకు కృషి చేస్తా: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Speech at Public Meeting in Nellimarla Constituency:నెల్లిమర్లలో కిడ్నీ వ్యాధుల సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం చూపిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని పవన్‌ అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి ఇక్కడికి పరిశ్రమలు రావాలని అన్నారు. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లిమర్ల జూట్ మిల్ మూసివేతతో వేలమంది ఉపాధి కోల్పోయారని కేంద్రంతో మాట్లాడి మళ్లీ జూట్ మిల్ తెరిపించేందుకు కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల బరిలో ముఖ్యమంత్రుల వారసులు- ఆ ఆరుగురు ఎవరో తెలుసా? - AP ELECTIONS 2024

రామతీర్థం విగ్రహం ఘటన చూసి చాలా బాధపడ్డానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురంను ఆనుకుని ఉన్న వ్యూహాత్మక ప్రాంతం నెల్లిమర్ల అని కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నెల్లిమర్ల ప్రజల కష్టాలు తీరుస్తామని అన్నారు. జగన్‌ దోపిడీ వల్ల ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం దొరకదని వారే ఉన్న స్థలాలన్నీ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్నాయని అధికారంలోకి రాగానే పరిష్కారం చూపిస్తామని అన్నారు. చంపావతి నది నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నారు ఈ ఇసుక దోపిడీ ఆగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు - High Court on Volunteers

ఉత్తరాంధ్ర వలసలు ఆగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బాబాయిపై గొడ్డలివేటు గాయం కాదా గులకరాయి దెబ్బే గాయమా అని జగన్​పై విరుచుకుపడ్డారు. అమర్నాథ్​ అనే చిన్న పిల్లాడిని వైసీపీ కార్యకర్తలు కాల్చి చంపేస్తే ఎవ్వరూ మాట్లడలేదని జగన్​కు చిన్న దెబ్బ తగిలితే అందరూ అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులకు ఉన్న పథకాలన్నీ తీసేసారని మండిపడ్డారు. దళితుల కోసం గతంలో ఇచ్చిన పథకాలన్నీ మళ్లీ తెస్తామని అన్నారు. లోకం మాధవి పదేళ్లుగా ఇక్కడ సేవలు అందిస్తున్నారని పవన్ తెలిపారు. అమెరికా నుంచి వచ్చి మిరాకిల్ సంస్థ ద్వారా ఉపాధి కల్పించారని అలాంటి మాధవిని గెలిపించాలని ప్రజలకు సూచించారు.

ఉత్తరాంధ్రలో 'కీ'లకం - విజయనగరం విజేత ఎవరో? - Vizianagaram Lok Sabha Elections

అక్రమ కేసుల ద్వారా జైలులో పెట్టినా చంద్రబాబులో ఏ మాత్రం ధైర్యం తగ్గలేదని పవన్ కొనియాడారు. రాజకీయ పోరాటం చేయడమే చంద్రబాబుకు తెలుసని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే ఈయన వల్ల మాత్రమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎవరు నవ్వుతూ ఉన్నా జగన్ చూడలేరని క్షణాల్లో నవ్వును మాయం చేసి రాక్షసానందం పొందుతాడని దుయ్యబట్టారు. కళ్లెదుట తప్పులు జరిగినప్పుడు చూస్తూ ఊరుకునే వ్యక్తిత్వం తనది కాదని పవన్ అన్నారు. ప్రజల బంగారు భవిష్యత్తుకు బాట వేసేందుకే మేం కలిశామని పవన్‌ కల్యాణ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details