Pawan Kalyan's statement : ఒంటరిగా వెళ్తే కొన్ని సీట్లు గెలుస్తాం కానీ, ప్రభుత్వంలోకి వెళ్లలేం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాడర్‌కు స్పష్టం చేశారు. టీడీపీతో కలిస్తే బలవంతులమవుతాం, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది అని పవన్ తెలిపారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుంది, ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు అని పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు ఊరంతా శత్రువులే, వైఎస్సార్సీపీ నేతలకు కష్టమొస్తే నా వద్దకు రండి అని అన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి ఖరారు - ధ్రువీకరించిన అధిష్టానం
ఒంటరిగా వెళ్తే కొన్ని సీట్లు గెలుస్తాం కానీ, ప్రభుత్వంలోకి వెళ్లలేం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాడర్‌కు స్పష్టం చేశారు. టీడీపీతో కలిస్తే బలవంతులమవుతాం, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది అని పవన్ తెలిపారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుంది, ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు అని పేర్కొన్నారు. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడడం సరికాదన్నారు. జగన్‌పై తనకు వ్యక్తిగత కక్ష లేదు కానీ, జగన్ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదన్నదే తదుపరి కర్తవ్యమని పవన్ స్పష్టం చేశారు. తెలుగుదేశం 2 సీట్లు ప్రకటించినందున తాను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీచేస్తుందని పవన్ ప్రకటించారు.