తెలంగాణ

telangana

ETV Bharat / politics

పరకాల కాంగ్రెస్​లో వర్గ విభేదాలు - కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి - Lok Sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Parkal Congress Clash latest : హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ లోక్‌సభ సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ నెలకొంది. వేదికపై ముఖ్యనేతలు ఉండగానే ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.

Congress Internal Clashes in Parkal
Congress Internal Clashes in Parkal

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 9:59 AM IST

రసాభాసగా కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభ సన్నాహక సమావేశం

Parkal Congress Clash latest :అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత హస్తం పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇతర పార్టీలకు చెందిన రాష్ట్రస్థాయి నాయకుల నుంచి మండల, గ్రామ స్థాయి కార్యకర్తల వరకు కాంగ్రెస్ కండువా కప్పుకొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీకి ఓటు బ్యాంకు బలపడుతుందనే వ్యూహంతో హైకమాండ్ సైతం ఇందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చినవారితో, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నవారి మధ్య బహిరంగంగానే వర్గ పోరు భగ్గుమంటోంది. లోక్‌సభ వేళ పార్టీకి ఇది తలనొప్పిగా మారుతోంది.

Lok Sabha Elections 2024 : తాజాగా హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వరంగల్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా (Clashes in Congress Leaders)సాగింది. పరకాల మండలం కామారెడ్డిపల్లి శివారులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పరకాల ఎమ్మెల్యే, ఎన్నికల ఇన్‌ఛార్జి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితర నాయకులు హాజరయ్యారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట

Clash Between Congress Leaders in Parkal : ఈ క్రమంలోనే అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. తమకు తెలియకుండా ఇటీవల పలు మండలాలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడంపై మంత్రి కొండా సురేఖ వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో మంత్రి లేకుండానే సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యమివ్వడం లేదంటూ ఆ వర్గానికి చెందిన ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ఛైర్మన్‌ గజ్జి విష్ణు గొడవకు దిగారు. కొండా దంపతుల నేతృత్వంలో పనిచేసి హస్తం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు.

అగ్రంపహాడ్‌ సమ్మక్క జాతరలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ వర్గీయుల మధ్య వాగ్వాదం

దీంతో మంత్రి, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన కార్యకర్తల (Fight Between Congress Activists )మధ్య తోపులాట చోటుచేసుకుంది. వేదికపై ముఖ్యనేతలు ఉండగానే ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే గజ్జి విష్ణు, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విష్ణు వర్గీయులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సీఐ రవిరాజు వారికి నచ్చజెప్పి విష్ణును బయటకు తీసుకురావడంతో అందరూ కలిసి సమావేశ మందిరానికి చేరుకున్నారు. గజ్జి విష్ణును, ఆయన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ప్రకటించారు.

Congress BRS Leaders Clash in Jadcherla : మహబూబ్​నగర్​లో టెన్షన్​.. టెన్షన్​.. బీఆర్​ఎస్ ​- కాంగ్రెస్​ నేతల మధ్య ఘర్షణ

ఎమ్మెల్యేలకు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ప్రెస్​మీట్ - చివరకు ఏమైందంటే

ABOUT THE AUTHOR

...view details