NDA Alliance MP Candidates Leading: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రతి రౌండ్లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై తెలుగుదేశం అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు 3.07 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అనకాపల్లి పార్లమెంట్‌లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుపై బీజేపీ అభ్యర్థి సి.ఎం.రమేష్ గెలుపొందారు. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద రావుపై భారీ ఓట్ల తేడాతో విజయదుందుభి మోగించారు.
రాజమండ్రిలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసులు వెనుకంజలో ఉన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి 2,35,469 లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. విజయవాడ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని తన ప్రత్యర్థి కేశినేని నానిపై 2,78,333 లక్షల మెజారిటీలో కొనసాగుతున్నారు. గుంటూరులో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై భారీ విజయం సాధించారు.
నరసాపురంలో టీడీపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2.76 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాకినాడ లోక్‌సభ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ విజయదుందుభి మోగించారు. విజయనగరం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు భారీ ఓట్ల తేడాతో గెలుపొందారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరనెడ్డి ప్రభాకర్ రెడ్డి, తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిపై భారీ విజయం సాధించారు. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి మతుకుమిల్లి భరత్ తన సమీప వైెఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిపై భారీ ఓట్ల తేడాతో గెలుపొందారు.