ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఉద్యోగులకు ఒకటో తారీఖున వేతనాలు - ఆ అధికారులపై న్యాయవిచారణ : లోకేశ్ - Nara Lokesh Election Campaign - NARA LOKESH ELECTION CAMPAIGN

Nara Lokesh Election Campaign in Mangalagiri : ప్రభుత్వాలు మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఒకటో తారీకున వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలో లోకేశ్ పర్యటించారు.

nara_lokesh_speech
nara_lokesh_speech

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 11:57 AM IST

Nara Lokesh Election Campaign in Mangalagiri: వైఎస్సార్సీపీ హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ చేసి వాటిని ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలోని ఏ ఆర్ అపార్ట్​మెంట్​ వాసులతో నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అపార్ట్​మెంట్​ వాసులు పలు సమస్యలను నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఒకటో తారీకున వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చిన లోకేశ్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details