ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎం జాబితాలో జగన్ ఫస్ట్​ : లోకేశ్ - Nara Lokesh Fire on CM Jagan - NARA LOKESH FIRE ON CM JAGAN

Nara Lokesh Fire on CM Jagan: సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎం జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉన్నారని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సీఎం జగన్​పై విమర్శలు గుప్పించారు.

Nara_Lokesh_Fire_on_CM_Jagan
Nara_Lokesh_Fire_on_CM_Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 12:23 PM IST

Updated : Apr 7, 2024, 12:52 PM IST

సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎం జాబితాలో జగన్ ఫస్ట్​ : లోకేశ్

Nara Lokesh Fire on CM Jagan:సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎం జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాలనుకొండలోని ఆర్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌ వాసులతో లోకేశ్‌ సమావేశం అయ్యారు. ఉద్యోగుల సీపీఎస్, ఓపీఎస్‌ పైన సమగ్రంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చేస్తామని నారా లోకేశ్ అన్నారు. సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని ఆ తర్వాతే వాటిపైన మాట్లాడుతామన్నారు.

గంగిరెడ్డి ఆధారాలు తుడుస్తుంటే అవినాష్ చూస్తూ నిలబడ్డారు - రవీంద్రనాథ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు - MLA Ravindranath On Viveka Case

అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నీ అందిస్తామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఐటీని ప్రోత్సహించి ఇక్కడికి పరిశ్రమలు వచ్చేలా చేసి తద్వారా కొలువులు సృష్టిస్తామన్నారు.

తెలుగుదేశం హయాంలో దాదాపు 72 శాతం పోలవరం పనులను పూర్తి చేస్తే మిగతా పనులను ఇంతవరకూ సీఎం జగన్ పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. అసలు పోలవరం పనులు ఎలా సాగుతున్నాయో ఎవరికీ తెలియటం లేదని అన్నారు. జలవనరుల సంఘం మంత్రిగా పని చేసిన అనిల్ కుమార్​కు ప్రాజెక్టుపై అవగాహన లేదని లోకేశ్ చెప్పారు.

తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయి: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

దక్షిణ భారతదేశానికి 'గోల్డ్‌ క్లస్టర్‌'గా మంగళగిరిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. దేశ ప్రగతిని రాష్ట్రం ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. రెండు ట్రిలియన్ డాలర్ల సంపాదనే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం అని మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించి సీఎం అయిన జగన్‌ ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టారన్నారు.

అనుమతులు ఉన్నా నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చేశారన్నారు. ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. విధ్వంసకర పాలనతో యువత భవిష్యత్తు నాశనమైందని ధ్వజమెత్తారు. లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలను చదివించుకుంటే ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు.

బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్ షర్మిల - YS Sharmila Blames Jagan

Last Updated : Apr 7, 2024, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details