CBN TEAM OATH CEREMONY : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో మారు ఎన్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు సహా 25 మంత్రుల తో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసారి మంత్రులంతా దైవ సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. మంత్రులంతా తమ ప్రమాణంలో అంతః కరణ శుద్ధి అనే పదాన్ని ఒత్తి పలుకుతూ జాగ్రత్త పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గా నారా చంద్రబాబునాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రజల ఆనందోత్సాహాలు, అభివాదాలు మధ్య నారా చంద్రబాబునాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రి గా ఆయన ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు తో ప్రమాణం చేయించారు. చంద్రబాబునాయుడు అనే నేను పదం పలకగానే వేదిక వద్ద కోలాహలంగా మారింది. సీఎం చంద్రబాబు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. దైవ సాక్షిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్న తరుణంలో కేరింతలు ఉత్సాహం గా నెలకొంది. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌కల్యాణ్ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు.
మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్- సామాజిక న్యాయానికి పెద్దపీట - AP New Cabinet Ministers List
చంద్రబాబు తో పాటు ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులు గా జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు.