Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌తో పలువురు ఆ పార్టీ అభిమానులు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో బాధితులను పరామర్శించటానికి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర నిర్వహించారు. ఈ పర్యటనలు ఏప్రిల్ 13వ తేదీతో ముగుస్తున్నాయి. ముగింపు సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుటికే తిరువూరులో చురుకుగా సాగుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నేడు, రేపు తిరువూరు నియోజకవర్గంలో "నిజం గెలవాలి " కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక మనస్తపంతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. నేటి సాయంత్రం విసన్నపేట మండలం కొండపర్వ గ్రామం, ఏ. కొండూరు మండలం కుమ్మరికుంట్ల, పోలిశెట్టిపడు గ్రామం, తిరువూరు మండలం కాకర్ల గ్రామంలో బాధిత కుటుంభ సభ్యుల పరామర్శించనున్నారు.
మీ బిడ్డల భవిష్యత్ ఆలోచించి ఓటు వేయండి: నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి - Nijam Gelavali Yatra
భువనేశ్వరి నేటి రాత్రి తిరువూరు శ్రీరస్తూ ఫంక్షన్ హాల్లో బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరువూరు పట్టణం 13 వార్డ్‌లో పరామర్శించనున్నారు. అనంతరం తిరువూరు పట్టణం దార పూర్ణయ్య టౌన్ షిప్ ఖాళీ స్థలం నందు నిజం గెలవాలి భారీ బహిరంగ సభలో పాల్గొని రానున్న ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రసంగించనున్నారు. తిరువూరులో నిజం గెలవాలి ముగింపు భారీ బహిరంగ సభకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.