MP Vemireddy Prabhakar Reddy resigned : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవినీ వదులుకున్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి తాను చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్‌ను వేమిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి కలిసేందుకు ఆయన అనుచరులు పెద్దఎత్తున తరలివచ్చారు. తనకు మద్దతుగా నిలిచిని వారందరికీ వేమిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వేమిరెడ్డిని కలిసేందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ నేతలతో తన నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ సహా ప్రముఖులు ఎంపీ నివాసానికి చేరుకుని పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాలువాతో సత్కరించారు.
అజ్ఞాతంలోకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి - జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా యోచన !
వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం రెండో కోలాహలంగా మారింది. పలు జిల్లాల నుంచి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. రాత్రి వరకు వేమిరెడ్డితో చర్చలు జరిపారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు కొందరు వచ్చి ఆయనను కలిసి మద్దతు తెలిపారు.