Viveka Murder Case:వివేకా హత్యకేసులో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా వివేకా హత్యపై స్పందించని సీఎం జగన్ మేము సిద్ధం భహిరంగ సభలో స్పందించారు. ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. మరోవైపు కోర్టులో సైతం వివేకా హత్యపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను తెలంగాణా హైకోర్టు ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని దస్తగిరి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హై కోర్టు ప్రతివాదులుగా అవినాష్ రెడ్డి, సీబీఐ, సునీతలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరగా విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.
అంతకు ముందు, అప్రూవర్ గా మారిన దస్తగిరి కి బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం లేదని అవినాష్ తరుపు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనతో కోర్టు విబేదించింది. నెల రోజుల క్రితమే ఎన్ఐఏ కేసులో అప్రూవర్ వేసిన పిటిషన్ ను డివిజన్ బెంచ్ అనుమతించిందన్న హైకోర్టు, అప్రూవర్‌కి ఈ తరహా డిమాండ్‌ను అడిగే హక్కు ఆ తీర్పులో ఉందని స్పష్టంగా ఉందని తెలిపింది. అప్రూవర్ దస్తగిరి పిటిషన్ ను తిరస్కరించలేమన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 4 కు వాయిదా వేసింది. మరోవైపు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 3 విచారణను వాయిదా వేసింది.