MLC Kavitha Reaction on Congress Indravelli Meeting : రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ సీఎం అని అనుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఇప్పటికే తప్పులను తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, మలి దశ తెలంగాణ ఉద్యమంలో బలైన అమరవీరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.500 గ్యాస్ సిలిండర్ కార్యక్రమానికి, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఆహ్వానించడాన్ని ఆమె తప్పుబట్టారు. హామీల అమలుకు ఏ హోదా లేని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇంకోసారి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తే, నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ మేరకు బంజారాహిల్స్లో ఆమె మాట్లాడారు.
ఫూలే విగ్రహ ఏర్పాటుపై అప్పటిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలి : కవిత
MLC Kavitha Fire on Revanth Reddy : ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సభలో వేలాది కుర్చీలు వేసి, భారీగా ఏర్పాట్లు చేశారని దీనికి ప్రభుత్వ నిధులు ఎందుకు ఉపయోగించుకున్నారని కవిత(MLC Kavitha) ప్రశ్నించారు. సభకు ఎంత ఖర్చు అయింది, అందులో కాంగ్రెస్ ఎంత చెల్లించిందని అడిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఇవ్వలేదని ఆరోపించారు. మంత్రులు ఎస్కార్ట్లతో ఇతర రాష్ట్ర ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం ప్రజాధనం వృథా కాదా అని నిలదీశారు.
నిజామాబాద్ లోక్సభ బరి నుంచి ఎమ్మెల్సీ కవిత ఔట్ - మరి ఎక్కడి నుంచి పోటీ అంటే?