తెలంగాణ

telangana

ETV Bharat / politics

నా యుద్ధం కౌశిక్​ రెడ్డితోనే - బీఆర్​ఎస్​తో కాదు : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ - Arekapudi Gandhi Latest Comments - AREKAPUDI GANDHI LATEST COMMENTS

Arekapudi Gandhi VS Padi Kaushik Reddy : తనకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అంటే ఎంతో గౌరవమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. ఏదైతే జరుగుతుంతో అది పాడి కౌశిక్ రెడ్డికి, తనకు వ్యక్తిగతంగా జరుగుతున్న యుద్ధమన్న ఆయన, దీనికి బీఆర్ఎస్​కు సంబంధం లేదని అన్నారు.

Arekapudi Fires on Kaushik Reddy
Arekapudi Fires on Kaushik Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 10:52 AM IST

Updated : Sep 13, 2024, 3:53 PM IST

Arekapudi Fires on Kaushik Reddy :తనకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అంటే ఎంతో గౌరవమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. పార్టీలో కోవర్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమికి కారకులయ్యారంటూ కౌశిక్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. గురువారం నుంచి ఏదైతే జరుగుతుంతో అది పాడి కౌశిక్ రెడ్డికి తనకు వ్యక్తిగతంగా జరుగుతున్న యుద్ధమన్న ఆయన, దీనికి బీఆర్ఎస్​కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అందుకే కౌశిక్​ రెడ్డి ఇంటికి వెళ్లానని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నారని, ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారితో పార్టీలో ప్రమాదం అని కేసీఆర్ గుర్తించాలన్నారు. కౌశిక్ రెడ్డి లాంటివారి వల్ల మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. సమవుజ్జీ కాని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నట్లు తెలిపారు.

Last Updated : Sep 13, 2024, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details