ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

సభ్యత్వాలు పోతాయనే భయం - అందుకే అలా వచ్చి వెళ్లారు: అచ్చెన్నాయుడు - MINISTERS ON JAGAN PROTEST

సభలో వైఎస్సార్సీపీ నేతల వైఖరి దారుణంగా ఉందని మంత్రులు ఫైర్ - హాజరు కోసమే సభకు వచ్చారని వెల్లడి

Ministers_on_Jagan_protest
Ministers_on_Jagan_protest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 1:39 PM IST

Ministers Comments on Jagan Protest in Assembly:వైఎస్సార్సీపీ నేతలు కేవలం హాజరు కోసమే అసెంబ్లీకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. 60 రోజులపాటు సభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతామనే భయంతోనే అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలతో పుట్టిన జగన్​ పార్టీకి అసత్యాలు చెప్పటం ఆలవాటు అయిపోయిందని మండిపడ్డారు.

ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం తమ ప్రతి పక్ష హోదా గురించి మాట్లాడి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు రాను అని చెప్పడం ఏమిటని నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు అని ఆ పార్టీ గుర్తించలేకపోతోందని విమర్శించారు. నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి అచ్చెన్న అన్నారు.

ఏ విషయం పైనైనా చర్చించేందుకు సిద్ధం :ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందనే భ్రమలోనే పులివెందుల ఎమ్మెల్యే ఉన్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత విమర్శించారు. ప్రజల్ని జగన్ ఇంకా మభ్యపెట్టలేరని ఆమె అన్నారు. అసెంబ్లీకి వస్తే జగన్​కు మైక్ ఇచ్చి ఏ విషయం పైనైనా చర్చించేందుకు సిద్ధమని మంత్రి సవిత తెలిపారు.

అడిగితే కాదు ప్రజలిస్తే వచ్చేది - ఫిక్స్​ అయిపోండి ప్రతిపక్ష హోదా రాదు: పవన్​కల్యాణ్​

ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేదే: జగన్ ప్రతిపక్ష హోదా అడిగేందుకు సభకు రావటం బాధాకరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు సభకు వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేదే కానీ తాము ఇచ్చేది కాదని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే విధ్వంస పాలనతో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి పంపినందుకే ఈ సారి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రజల పక్షాన పోరాడి వారి మన్ననలు పొందాల్సింది పోయి ప్రతిపక్ష హోదా అడిగేందుకు అసెంబ్లీకి రావటం దురదృష్టకరమని మంత్రి మండిపడ్డారు.

సభ నుంచి తప్పించుకునేందుకే: జగన్​కు ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వలేదని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ నిరసన ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. ప్రతిపక్ష హోదా డిమాండ్‌తో కాకుండా నిబంధనల ప్రకారం సభ జరగాలన్నారు. శాసన మండలి ఎలాంటి డిమాండ్ లేకుండా నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదాను ఆమోదించిందని తెలిపారు. సభ నుంచి తప్పించుకునేందుకు రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్ జగన్‌ చేశారని విమర్శించారు. సభ నియమనిబంధనలకు అనుగుణంగా జగన్ నడుచుకోవాలని యనమల రామకృష్ణుడు హితవుపలికారు.

మంత్రి గుమ్మడి సంధ్యారాణి: ప్రజలు అసహ్యించుకునేలా అసెంబ్లీలో జగన్ ప్రవర్తన ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా అడగటం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు. ప్రజా హక్కుల కోసం కాకుండా తనకు హక్కులు ఇవ్వాలంటూ ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీకి వచ్చారని విమర్శించారు. జగన్ తాను అసెంబ్లీకి వచ్చానని అనుకున్నారా లేక తాడేపల్లి ప్యాలెస్​లో ఉన్నానని అనుకుంటున్నారా అని మంత్రి మండిపడ్డారు. రాజ్యాంగం గురించి జగన్ మాట్లాడటం మిలీనియం జోక్ అని అన్నారు.

11 నిమిషాలు నినాదాలు - గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ

జాగ్రత్త - ఆ బురద మనకు అంటించాలని చూస్తారు - జనసేన సభ్యులతో పవన్‌ కల్యాణ్‌

ABOUT THE AUTHOR

...view details