Minister Uttam on Krishna Water Supply Issue :కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టులు కట్టి, తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీకి తరలిస్తుంటే కేసీఆర్ నిశ్శ బ్ధంగా ఉన్నారన్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్(AP CM Jagan) ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆయన బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. లక్ష కోట్ల దోచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.
మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే అవకాశం :పాక్షికంగా కుంగిన మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని, మేడిగడ్డ బ్యారేజ్‌పై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు(Sundilla Project) కూడా ప్రమాదంలో ఉన్నాయని రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. కృష్ణానది జలాలపై తాము ముందుకు పోలేదని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నీళ్ల పంపకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే విడిపోయిన తరువాతే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఆవేదన చెందారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి : ఉత్తమ్
"2022 ఏడాదిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పేరిట, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కృష్ణానది జలాల్లో గ్రావిటీ ద్వారా మన రాష్ట్రానికి ఉచితంగా వచ్చే 8 టీఎంసీల నీటిని అన్యాయంగా తరలించుకుపోయారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు వచ్చే నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్ట్ ద్వారా 203 టీఎంసీలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరలిస్తుంటే కనీసం నోరైనా మెదపలేదు."-ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి