Minister Roja Complained to CM Jagan about Dissident Leaders :ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాపై (Minister Roja) వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతోంది. నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు నగరి, పుత్తూరు నేతలు రోజాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోజాను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నేతలు బహిరంగ విమర్శలు చేయడంతో పాటు రోజా ప్రమేయం లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జరగబోయే ఎన్నికలలో రోజాకు టికెట్ ఇస్తే ఓడించడం ఖాయమని నియోజకవర్గ వైసీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరించారు. నగరిలో రోజాకి తప్ప ఇంకెవరికి సీటు కేటాయించినా గెలిపిస్తామని నేతలు అంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఐరన్ లెగ్‌గా ముద్రపడిన రోజాను తమ కష్టంతో రెండుసార్లు గెలిపించామని ఇంక రోజాను గెలిపించేది లేదని హెచ్చరించారు.
ఓటర్లకు వైఎస్సార్సీపీ ఎర - ఉపాధ్యాయినులకు మంత్రి రోజా తాయిలాలు
తాడేపల్లికి చేరిన నగరి వ్యవహారం: అయితే ఈ వ్యవహారం తాడేపల్లికి చేరింది. సీఎం కార్యాలయానికి (Chief minister Camp Office) మంత్రి రోజా సీఎం జగన్ను కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ మధ్య నగరిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అసమ్మతి నేతలు రోజాపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. రోజాకు సీటిస్తే తప్పనిసరిగా ఓడిస్తామని అసమ్మతి నేతలు అల్టిమేటం జారీ చేయగా ఈ విషయమై మంత్రి రోజా సీఎం జగన్ను కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేశారు.