ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మేలు జరిగేలా కేబినెట్​లో నిర్ణయాలు: మంత్రి పార్థసారథి - PARTHASARATHI ON CABINET MEETING

కేబినెట్​లో మంత్రులు తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పార్థసారథి ప్రెస్​మీట్- ఎంఎస్​ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడి

Parthasarathi_on_Cabinet_Meeting
Parthasarathi_on_Cabinet_Meeting (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2025, 7:40 PM IST

Minister Parthasarathi on Cabinet Meeting Decisions: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వర్గాలకు చెందిన మహిళలకు మేలు జరిగేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పార్ధసారధి వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని పెద్ద ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ ప్రయత్నాలు ఉన్నాయని అన్నారు. ఎంఎస్​ఎంఈ విధానం, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ పాలసీలలో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివిధ ప్రోత్సాహకాలు బీసీ, ఎస్సి, ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఇవి వర్తింప స్తామని మంత్రి చెప్పారు.

విద్యుత్ సబ్సిడీని అన్ని వర్గాల మహిళలకి 5 ఏళ్లకు రూ.1.5 చొప్పున, ఎస్​జీఎస్టీ 5 శాతం ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. కోరమాండల్ ఫెర్టీలైజర్ కోరినట్టుగా కొన్ని మినహాయింపులు ఇస్తామన్నారు. ఎలీప్​కు అనకాపల్లి జిల్లాలో 31 ఎకరాల భూమి కేటాయింపుకు నిర్ణయం తీసకున్నామని అన్నారు. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ విస్తరణ ప్రణాళికను కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. రెవెన్యూ డివిజన్​కు అప్పిలెట్ అథారిటీని మారుస్తూ నిర్ణయం అందుకోసం పట్టాదారు పాస్ పుస్తకం చట్టం సవరణకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. నీరు చెట్టు పథకం కింద చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మేలు జరిగేలా కేబినెట్​లో నిర్ణయాలు: మంత్రి పార్థసారథి (ETV Bharat)

విద్యుత్ ఛార్జీలు తగ్గాలి, బడులు తెరిచేనాటికి డీఎస్సీ పూర్తవ్వాలి: సీఎం చంద్రబాబు

కేసులు వెనక్కు తీసుకునేలా ఆమోదం: పనులు చేసిన వాళ్లు టీడీపీ అనే కారణంతో గత ప్రభుత్వం విజిలెన్స్ కేసులు పెట్టిందని 380 జలవనరుల శాఖ ఇంజినీర్​లు మోపిన కేసులు వెనక్కు తీసుకునేలా కేబినెట్ ఆమోదం ఇచ్చిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రజా పనులు చేపట్టేందుకు వీలుగా కాంట్రాక్టర్​ల ఆర్థిక స్థాయిని సడలించేదుకు బిడ్ కెపాసిటీ ఆధారంగా పరిగణనలోకి తీసుకునేలా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల టెండర్​లను రద్దు చేసి కొత్తగా పిలిచెందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. నిర్వాసిత కాలనీల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు.

ఏపిలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పెద్దపీట:టీటీడీలో పోటు సూపర్ వైజర్​లను నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ కోసం డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుకు కేబినెట్ ఆమోదం ఇచ్చిందన్నారు. చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్​లో కొందరు రైతులకు వన్​టైమ్ మేజర్ కింద రూ.78 లక్షల పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మానవ వనరులను అభివృద్ధికి ఏపీ నాలెడ్జి సొసైటి కెపాసిటీ బిల్డింగ్ 2025కి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఏపిలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పెద్దపీట వేసేలా సౌర పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి అన్నారు.

అమరావతి నిర్మాణ పనులు - టెండర్లకు ఈసీ అనుమతి

మ్యూజికల్‌ నైట్‌కు సీఎం చంద్రబాబు అయినా టికెట్‌ కొనాల్సిందే: నారా భువనేశ్వరి

ABOUT THE AUTHOR

...view details