ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'జగన్ నేర సామ్రాజ్యాన్ని అంతమొందించి తీరుతాం' - TDP LEADERS COMMENTS ON JAGAN

ఒక అరాచకవాది మరో అరాచకవాదిని వెనకేసుకొస్తున్నారన్న టీడీపీ నేతలు - వ్యక్తిత్వహననానికి పాల్పడిన వంశీని జగన్ వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం

TDP_leaders_comments_on_Jagan
TDP_leaders_comments_on_Jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 7:36 PM IST

Updated : Feb 14, 2025, 10:36 PM IST

Minister Nimmala and MLA Palla Comments on Jagan:జగన్ నేర సామ్రాజ్యాన్ని అంతమొందించి తీరుతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒక అరాచకవాది మరో అరాచకవాదిని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి తన కారులోనే వంశీ కోర్టుకు తీసుకొచ్చాడని అన్నారు. వ్యక్తిత్వహననానికి పాల్పడిన వంశీని జగన్ వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ కేసుల్లో జరిగిన సాక్షుల్ని బెదిరించడం, కిడ్నాప్ చేయటం వంటి ఘటనలనే వంశీ అనుసరించారని అన్నారు. మహిళలు, దళితుల్ని కించపరిచిన వంశీని జగన్ సమర్ధిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సక్షేమం అంటే చంద్రబాబు బ్రాండ్ అని దాడులు, విధ్వంసం లాంటివి జగన్ బ్రాండ్ అని ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని మరిచి ఇంకా తన రాచరిక పాలనే అనే భ్రమలో జగన్ ఇంకా అహంకారంగానే మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల విమర్శించారు.

'జగన్ నేర సామ్రాజ్యాన్ని అంతమొందించి తీరుతాం' (ETV Bharat)

వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన హోం మంత్రి - ఏమన్నారంటే?

అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికారు: రాజకీయ ముసుగులో ఇంకా కొనసాగుతున్న నేరస్థులు ఊచలు లెక్కపెట్టక తప్పదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఘటనలో వీడియోలతో సహా అన్ని ఆధారాలతో వంశీ అడ్డంగా దొరికారని వెల్లడించారు. రాష్ట్రంలో ఇంకా గత 5 ఏళ్ల ఆటివిక రాజ్యం నడుస్తోందనే భావనలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలకు బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు.

వైద్యుడు సుధాకర్ మొదలు సత్యవర్ధన్ వరకూ దళితులపై వైఎస్సార్సీపీ అరాచకాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ, కొడాలినాని లాంటి వారి వల్లే తమ పార్టీ మంటగలిసిపోయిందని విశాఖలో వాసుపల్లి గణేష్ లాంటి వారు ప్రెస్​మీట్​లు పెట్టి మరీ చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తోంది కాబాట్టే చట్టం తన పని తాను చేసుకుపోతోందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.

నిర్వాసితుల‌ను కూట‌మి ప్రభుత్వం ఆదుకుంటుంది:గుండ్లక‌మ్మ ప్రాజెక్టుతో పాటు ముంపు ప్రాంత ప్రజలనూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముంచేసిందని మంత్రి గొట్టిపాటి రవి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో ప్రాజెక్టు వద్ద త‌ట్ట మ‌ట్టి ప‌ని కూడా చేయ‌లేదన్న ఆయన గుండ్లక‌మ్మ నిర్వాసితుల‌ను కూట‌మి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెంలో పర్యటించిన మంత్రి పునరావాసంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌ చేస్తోందని చెప్పారు. 20 ల‌క్షల‌తో నిర్మించిన రోడ్లు, సైడ్‌ డ్రైన్లను మంత్రి ప్రారంభించారు.

తర్వాత అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఏడు ముంపు గ్రామాల ప్రజ‌ల‌తోస‌మావేశ‌మై వారి స‌మ‌స్యల‌ను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పాఠ‌శాల‌లు, దేవాల‌యాల నిర్మాణంతో పాటు ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ను వెంట‌నే క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నిర్వాసితుల‌కు ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా తాను అండ‌గా ఉంటాన‌ని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.

కోడెల ప్రాణాన్ని YSRCP నేతలు తీసుకురాగలరా: ఎమ్మెల్యే చింతమనేని

భవిష్యత్తులో మరో చెల్లిపై ఇలాంటి ఘటనలు జరగకూడదు: మంత్రి లోకేశ్​

Last Updated : Feb 14, 2025, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details