Minister Narayana Conducted the Review with Authorities: పురపాలక శాఖలో ఉన్న ఆస్తుల పంపకాలపై రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ బోర్డు, సంబంధిత అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తి కావడంతోపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసిందని సమీక్షలో మంత్రి వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదని ఆయన అన్నారు. ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు ఉన్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉందని అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పేర్కొన్నారు.
సమస్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి నారాయణ - Minister Narayana on municipalities
తొమ్మిది, పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల మధ్య విభజన ఇంకా కొలిక్కి రావడం లేదని ఆయన తెలిపారు. పునర్విభజన చట్టంలో ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకునేలా ఉందని ఆ తర్వాత పంపకాల విషయంలో ఏ రాష్ట్రానికే సంబంధించినవి ఆ రాష్ట్రానికే చెందాలనే కొత్త అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని సంస్థలు పంచాయతీ రాజ్ శాఖకు చెందినవి కూడా ఉన్నాయని అలాంటి సంస్థలకు చెందిన వివరాల కోసం మంత్రి నారాయణ ఆరా తీశారు.