Minister Nara Lokesh Speech: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. విశాఖ బహిరంగ సభలో మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు. హర్ ఘర్ తిరంగా, ఎక్కడ చూసినా నమో నినాదాలే అని లోకేశ్ వ్యాఖ్యానించారు. పేదల చిరునవ్వు, మహిళల ఆశాదీపం నమో (నరేంద్ర మోదీ) అని తెలిపారు.
2047 నాటికి దేశాన్ని అగ్రగామిగా మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారని లోకేశ్ అన్నారు. నమో స్ఫూర్తితో ఏపీలో సీబీఎన్ 2047 విజన్ తయారు చేశారని వెల్లడించారు. హైదరాబాద్ వెళ్లి చూస్తే సీబీఎన్ విజన్ ఏంటో అర్థం అవుతుందన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారని కొనియాడారు. సమస్యలున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు సీబీఎన్ కృషి చేస్తున్నారని తెలిపారు.