Minister Konda Surekha fires on KTR :భయపడితే రాజకీయం చేయలేమని, కేసులు ఉంటే రాజకీయ నాయకులు ఇంకా పెద్దవాళ్లు అవుతారని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ పాలనలో తనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, నిర్భంధాలకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కేసులు పెట్టడం వల్లే రాజకీయంగా ఎదిగి, ఇప్పుడు మంత్రి పదవిని చేయగలుగుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రచార రథాల సందడి - Congress Campaign Vehicles Started
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించారు. తమ పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 100 హామీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.
LOK SABHA ELECTIONS 2024 :దళితులకు మూడెకరాల భూమి దగ్గర నుంచి నిరుద్యోగ భృతి మొదలగు పథకాలు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్‌ను (KTR) కొండా సురేఖ ప్రశ్నించారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించి, హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేటీఆర్, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని దుయ్యబట్టారు.