తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలన్నీ బయటపడతాయి - కేసీఆర్ అరెస్టు కాక తప్పదు : కోమటిరెడ్డి - Komatireddy about Phone Tapping

Minister komatireddy on KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ అరెస్టు కాక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్​ చెప్పడంతోనే గత నెల 26న హరీశ్‌రావు దొంగచాటుగా ఎస్​ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కలిసేందుకు అమెరికా వెళ్లారని ఆరోపించారు. ఫోన్​ ట్యాపింగ్​ విషయంపై ప్రభాకర్ రావును కలవలేదని హరీశ్‌రావు ప్రమాణం చేస్తారా అని సవాల్​ విసిరారు.

Minister komatireddy on Harish Rao
Minister komatireddy on KCR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 4:54 PM IST

Updated : Jun 2, 2024, 5:35 PM IST

Minister komatireddy on Harish Rao :తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలను రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో అన్ని నిజాలు బయటపడతాయన్న ఆయన, హరీశ్‌రావు దొంగచాటుగా అమెరికా వెళ్లి వచ్చారన్నారు. గత నెల 26న ఎమిరేట్స్‌ ఫ్లైట్‌ నంబరు ఈకే 525లో హరీశ్​రావును కేసీఆర్‌ అమెరికాకు పంపారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎస్​ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలవడానికే హరీశ్​రావు అమెరికా వెళ్లారని, ఇండియాకు రాకుండా ఆపేందుకే ఆయన​ను పంపించారని చెప్పారు.

ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీశ్‌రావు ఏమొచ్చిందని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలను కూడా విన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు అప్రూవర్​గా మారితే ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని హరీశ్‌రావు ప్రమాణం చేస్తారా అని సవాల్​ విసిరారు. ఎన్నిరోజులైనా కేసీఆర్​ను వదిలిపెట్టేది లేదని, వెంటనే వచ్చి లొంగిపోవాలని ప్రభాకర్‌ రావుకు మాజీ సీఎం చెప్పాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్ తెలంగాణ జిన్నా లాగా మారిపోయారని, జిన్నా కూడా ఒకరోజు ముందే స్వాతంత్య్ర దినోత్సవాన్ని చేసుకునే వారని చెప్పారు.

ఉద్యమంలో కోట్ల రూపాయలు వసూలు :మాజీ సీఎంకు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని, పదేళ్ల రాక్షస పాలన పోయిందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉద్యమంలో కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ రాజీనామా చేసింది కలెక్షన్స్ కోసమేనని, సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఆయనే అసెంబ్లీలో చెప్పారని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరే అని ప్రజలకు చెప్పి కేసీఆర్ మాత్రం వరి వేసుకున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరని, దాంట్లో ఓటర్లందరూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నందున తాము ఆ పార్టీ నాయకుల లాగా ప్రలోభాలకు గురి చేయకూడదనే డబ్బులు పంచలేదని తెలిపారు.

'రాష్ట్రంలో నీచమైన పని ఫోన్​ ట్యాపింగ్​. దొంగచాటుగా ఎస్​ఐబీ మాజీ చీఫ్, రిటైర్డ్​ అధికారి ప్రభాకర్​రావు కింద రౌడీ గ్యాంగ్​ రాధాకిషన్​రావు, ప్రణీత్​రావు, భుజంగరావు, తిరుపతన్నలతో లక్షల కోట్లు వసూలు చేశారు. ప్రభాకర్​ రావు అప్రూవర్​గా మారతారని, ఆయనను కలిసేందుకు కేసీఆర్​ హరీశ్​రావును అమెరికాకు పంపించారు.'- కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మంత్రి

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాక తప్పదు: మంత్రి కోమటిరెడ్డి (ETV Bharat)

లోక్​సభ ఫలితాల తర్వాత బీఆర్ఎస్​లో ఎవరూ ఉండరు : మంత్రి కోమటిరెడ్డి - Komati Reddy Shocking Comments

Last Updated : Jun 2, 2024, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details