తెలంగాణ

telangana

ETV Bharat / politics

దానం నాగేందర్​ను లక్ష లేదా రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

Minister Komati Reddy Venkat Reddy meet with Secunderabad Lok Sabha Leaders : సికింద్రాబాద్​ లోక్​సభ అభ్యర్థిగా దానం నాగేందర్​ను లక్ష నుంచి రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. సికింద్రాబాద్​ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తన నివాసంలో సమావేశం నిర్వహించారు.

Minister Komati Reddy Venkat Reddy
Minister Komati Reddy Venkat Reddy meet with Secunderabad Lok Sabha Leaders

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 4:28 PM IST

Minister Komati Reddy Venkat Reddy meet with Secunderabad Lok Sabha Leaders : లోక్​సభ ఎన్నికల్లో 13 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్​ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి రాబోయే పది సంవత్సరాల పాటు కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో అధికారంలోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సికింద్రాబాద్​ పార్లమెంటు(Secunderabad Lok Sabha) పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తన నివాసంలో సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్​ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ ఈ​ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్​ జన జాతర బహిరంగ సభ(Jana Hatha Sabha)కు జన సమీకరణ చేయాలని సూచించారు. అలాగే సికింద్రాబాద్​ పార్లమెంటు అభ్యర్థి నాగేందర్​ను గెలిపించాలని కోరారు. త్వరలో సికింద్రాబాద్​ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి కోమటి రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా కిషన్‌రెడ్డికి లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

Lok Sabha Election 2024 :ఎట్టి పరిస్థితిలో పార్లమెంటు ఎన్నికల్లో దానం నాగేందర్​ను లక్ష నుంచి రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. అధికారం కోల్పోయిన బీఆర్​ఎస్​ మూడు నెలల్లోపే కుప్పకూలిపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​కు కనీసం నిధులు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. బీజేపీ మతాల మధ్య ఘర్షణ పెట్టి గెలవాలని చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

"ముందుగా రేపు 6వ తేదీన జరిగే తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాలి. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ విచ్చేస్తున్నారు. జాతీయ మేనిఫెస్టోను ఈ సభలో విడుదల చేయబోతున్నారు. ఈ సభను 10 లక్షల మందితో నిర్వహించనున్నారు. సికింద్రాబాద్​ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నాము. అలాగే దానం నాగేందర్​ను లక్ష నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటాం."- కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి

దానం నాగేందర్​ను లక్ష లేదా రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి

'కోమటిరెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు - బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది'

13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం - ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మొద్దు : మంత్రి కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details