ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

నా కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతారా - పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలి: కొల్లు రవీంద్ర - MINISTERKOLLU ON RAVINDRANATH ISSUE

నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి రవీంద్రనాథ్‌బాబుకు ఆహ్వానం - తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతారా అని మండిపడిన మంత్రి కొల్లు

Minister_Kollu_on_Ravindranath_Issue
Minister_Kollu_on_Ravindranath_Issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 8:51 PM IST

Minister Kollu Ravindra serious on Ravindranath Babu Issue:నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో కొల్లు రవీంద్రపై తప్పుడు కేసు బనాయించి రవీంద్రనాథ్ బాబు అరెస్టు చేశారు. తనను తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతూ తనని అవమానిస్తారా అని మంత్రి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేతలకు తొత్తులా పని చేసిన వ్యక్తిని సభకు ఆహ్వానించడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు.

తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన ప్రమాణ స్వీకారానికి మంత్రి కొల్లు రవీంద్రకు ఆహ్వానం అందింది. మంత్రి కొల్లు రవీంద్ర అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ ఉదయం కార్యక్రమానికి హాజరైన అతిథుల్లో రవీంద్రనాథ్ బాబు ఉన్నారనే విషయం తెలుసుకుని మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details