ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వైఎస్సార్సీపీకి మరో షాక్​, మంత్రి గుమ్మనూరు రాజీనామా - "జగన్ గుడిలో విగ్రహం లాంటివారు!" - గుమ్మనూరు జయరామ్ రాజీనామా

Minister Gummanur Jayaram Resign to YSRCP : వైఎస్సార్సీపీకి మరో షాక్‌ తగిలింది. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. జగన్‌ గుడిలో శిల్పం మాదిరిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఈరోజు సాయంత్రం టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

Minister Gummanur Jayaram Resign to YSRCP
Minister Gummanur Jayaram Resign to YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 12:05 PM IST

Updated : Mar 5, 2024, 12:49 PM IST

వైఎస్సార్సీపీకి మరో షాక్​, మంత్రి గుమ్మనూరు రాజీనామా - జయహో బీసీ సభలో టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడి

Minister Gummanur Jayaram Resign to YSRCP : తన మాటే శాసనం, తన నిర్ణయమే ఫైనల్ అంటూ, ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో సీఎం జగన్ సంచలనాలకు తెర తీశారు. కష్టకాలంలో తనతో నడిచిన వారికి సైతం మెుండి చేయి చూపించారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన నేతలకు టికెట్ కేటాయించే అంశంపై, అసంతృప్తిని సైతం పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఇప్పటికే విడుదలైన 9 జాబితాల్లోనూ ఇదే తంతు పాటించింది వైఎస్సార్సీపీ అధిష్టానం. దీంతో అధికార పార్టీ కీలక నేతలు జగన్​కు గుడ్ బై చెప్పారు. చెబుతున్నారు.

జయహో బీసీ సభలో టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడి :ఈ తరుణంలో వైఎస్సార్సీపీకి మరో షాక్‌ తగిలింది. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'జయహో బీసీ (Jayaho BC) ' సభలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్‌ విధానాలతో విసుగుచెంది వైసీపీకకి రాజీనామా చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని వెల్లడించారు.

రాజ్యసభ ఎన్నికల కోసం అసంతృప్తి నేతల బుజ్జగింపులు - మంత్రి జయరాంకు సీఎంవో నుంచి పిలుపు

జగన్ గుడిలో విగ్రహం లాంటివారు : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్‌ తనను అడిగారని జయరాం తెలిపారు. తనకు అది ఇష్టం లేదని అన్నారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్‌ తయారయ్యారని ఎద్దేవా చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారని ఆరోపించారు.

జయరాం రాజీనామా చేయడానికి దారి తీసిన కారణాలు :గత నెలరాజ్యసభ ఎన్నికల దృష్య్టా పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ బుజ్జగించిది. అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాంకు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి, సీఎంవోలో ధనుంజయరెడ్డితో సమావేశమయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంకు వచ్చే ఎన్నికల్లో ఆలూరు టికెట్ నిరాకరించారు. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని వైఎస్సార్సీపీ ప్రకటించింది. గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించింది. కర్నూలు ఎంపీగా వెళ్లేందుకు నిరాకరిస్తున్న జయరాం గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా గుమ్మనూరు జయరాంను వైఎస్సార్సీపీ నేతలు బుజ్జగించారు. ఆలూరు సీటు తనకే ఇవ్వాలని పట్టు పట్టినట్లు తెలిసింది.

ఆలూరు టికెట్ జయరాంకు కేటాయించాలని ఆందోళన : గత జనవరి 12వ తేదీన ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన విరూపాక్షిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి జయరాం గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్సీపీ పెద్దలు జయరాంకు కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించినా ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆలూరు టికెట్ జయరాంకు కేటాయించాలని కార్యకర్తలు ఆందోళన నిర్వహించినా, అధిష్టానం పట్టించుకోలేదు. కానీ, తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ మూడు రాజ్యసభ స్థానాలకు పోటీకి దిగడంతో, ఆ మూడు సీట్లను గెలిపించుకోవాలని సీఎం జగన్ సవాల్​గా తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభ సీటు చేయి జారిపోతే పడే ప్రభావం దృష్ట్యా అసంతృప్తి నేతలతో సీఎం మంతనాలు ప్రారంభించారని, అందుకే జయరాంకు సీఎంవో నుంచి పిలుపు అందినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

'ఆలూరు టికెట్ గుమ్మనూరుకే కేటాయించాలి - అభ్యర్థిని మార్చితే ఓటమి ఖాయం'

Last Updated : Mar 5, 2024, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details