తెలంగాణ

telangana

ETV Bharat / politics

జనం కోసం కదిలిన జనసేనానికి ఓటేయండి - పిఠాపురం ఓటర్లకు మెగాస్టార్ స్పెషల్ రిక్వెస్ట్ - Chiranjeevi Support To Pawan Kalyan - CHIRANJEEVI SUPPORT TO PAWAN KALYAN

Chiranjeevi Supports Pawan Kalyan's Janasena : పవన్ కల్యాణ్​ను పిఠాపురంలో గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పవన్ లాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పవన్​ను గెలిపించి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.

Chiranjeevi Video on Pawan Kalyan
Chiranjeevi Support To Pawan Kalyan

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 12:19 PM IST

Updated : May 7, 2024, 2:40 PM IST

జనం కోసం జనసైనికుడు మీ కోసం ఎందాకైనా పోరాడతాడు చిరంజీవి

Chiranjeevi Supports Pawan Kalyan :జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు చిరంజీవి మద్దతు లభించింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్​ను గెలిపించాలంటూ చిరు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పవన్ కల్యాణ్​ లాంటి వ్యక్తి పిఠాపురం ప్రజలకు మేలు చేస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టిన పవన్​లో సమాజహితం కోరే అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు.

తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం తన తమ్ముడిది అని కొనియాడారు. కల్యాణ్‌ తన సొంత సంపాదనను కౌలు రైతులకు ఖర్చు పెట్టాడని, సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు కానీ రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడని అన్నారు. ఎంతో మంది తల్లుల బిడ్డల కోసం పవన్‌ పోరాడుతున్నారని కొనియాడారు. పిఠాపురం వాసుల కోసం పవన్ కల్యాణ్​ పోరాడుతాడని, జనం కోసమే పవన్‌ మాటలు పడుతున్నారని తెలిపారు.

వారాహి యాత్రలో కలకలం- పవన్ కల్యాణ్​పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి - Attack On Pawan Kalyan Varahi Yatra

ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలి: ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు కానీ పవన్‌ కల్యాణ్‌ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం, మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలని అనిపిస్తోందన్నారు.

తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎందాక అయినా: ఏ తల్లికైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని, ఏ అన్నకైనా తన తమ్ముడు అవస్థలు పడుతుంటే బాధేస్తుందని అన్నారు. అలా బాధ పడుతున్న తన తల్లికి ఒక మాట చెప్పానని, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది అని చెప్పానన్నారు. పవన్ కల్యాణ్​ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎందాక అయినా పోరాడతాడని, తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని పేర్కొన్నారు.

ఒక అన్నయ్యగా నిలబడతాడు: ప్రజాసేవ చేయాలన్న పవన్ లక్ష్యం ఉన్నతమైనదని, మీలో ఒకడిగా ఉంటూ, మీకోసం పోరాడే జనసైనికుడిని పిఠాపురం ప్రజలు గెలిపించాలని కోరారు. చట్టసభల్లో పవన్ లాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, చిన్నతనం నుంచే పవన్​లో ఆదర్శభావాలు, ప్రజాసేవ చేయాలన్న ఆశయం బలంగా ఉండేదని తెలిపారు. పవన్ కల్యాణ్​ మీకు సేవకుడిగా, సైనికుడిగా, ఒక అన్నయ్యగా నిలబడతాడని, పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్​ను గెలిపించి, నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేసుకోవాలని చిరంజీవి పిలుపునిచ్చారు.

Actor Nani Tweet About Pawan Kalyan: మరోవైపు జనసేన పార్టీకు హీరో నాని మద్దతు ప్రకటించారు. పవన్ పెద్ద రాజకీయ యుద్ధం చేస్తున్నారని, సినీ కుటుంబ సభ్యుడిగా ఆయన విజయం ఆశిస్తున్నాన్నారు. పవన్ కల్యాణ్​ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నానన్న నాని, ఆయనకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడున్నాయని తెలిపారు. తన మద్దతు పవన్ కల్యాణ్​కి అని, ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.

సీఎం జగన్​కు దెబ్బతగిలితే ఏపీకీ గాయమైనట్లా? : పవన్​ కల్యాణ్ - Pawan Kalyan Speech at Tenali

తుని రైలు దహనం వైఎస్సార్సీపీ కుట్రే : పవన్​ కల్యాణ్​ - Pawan Kalyan Tuni Train incident

Last Updated : May 7, 2024, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details