తెలంగాణ

telangana

ETV Bharat / politics

''ఫోన్​ ట్యాపింగ్​'లో కొందరినే బాధ్యులు చేయడం సరికాదు - ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి' - BJP on Phone Tapping Case - BJP ON PHONE TAPPING CASE

Raghunandan Rao on Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో కానీ, సీబీఐతో గానీ విచారణ జరిపించాలని బీజేపీ నేత రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు డీల్స్‌ జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, ఈ కేసుపై చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

Raghunandan Rao on Phone Tapping Case
Raghunandan Rao on Phone Tapping Case

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 4:35 PM IST

Updated : Mar 26, 2024, 7:34 PM IST

''ఫోన్​ ట్యాపింగ్​'లో కొందరినే బాధ్యులు చేయడం సరికాదు - సీబీఐతో విచారణ జరిపించాలి'

Raghunandan Rao on Phone Tapping Case : రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. పోలీసుల విచారణలో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలతో పాటు బడా వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు తేలడంతో ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే బీజేపీ నేత, ఆ పార్టీ మెదక్​ లోక్​సభ అభ్యర్థి రఘునందన్​ రావు ఈ కేసుపై స్పందించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో కానీ, సీబీఐతో గానీ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

గతంలో రేవంత్‌రెడ్డిని టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా అరెస్టు చేశారని రఘునందన్‌ రావు ఆరోపించారు. 2014 నుంచి టెలిఫోన్లు ట్యాపింగ్‌ జరిగినట్లు అర్థమవుతోందన్న ఆయన, ఈ కేసులో చిత్తశుద్ధితో విచారణ చేయాలని కోరారు. కొందరినే బాధ్యులను చేయడం సరికాదని, ఇద్దరు ఏఎస్పీలను అరెస్టు చేసి చేతులు దులుపుకోవద్దని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మొదటి ముద్దాయిగా, హరీశ్​రావును రెండో ముద్దాయిగా, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను ముద్దాయిలుగా చేర్చకపోతే, కేసు సంపూర్ణం కాదని వ్యాఖ్యానించారు.

ఫోన్ల ట్యాపింగ్‌కు కేసీఆర్ బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి

కేసు నుంచి తప్పించుకునేందుకు డీల్స్​ : ఫోన్లు ట్యాపింగ్‌ చేసే అధికారం ఎవరికీ లేదన్న రఘునందన్‌, గతంలో తన ఫోన్​ కాల్స్​నూ ట్యాప్​ చేసే ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే గతంలో రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోయారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రణీత్‌ రావు, భుజంగ రావు, తిరుపతన్నకు ట్యాపింగ్‌ పరికరాలు ఎవరు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన, కేసు నుంచి తప్పించుకునేందుకు డీల్స్‌ జరుగుతున్నాయని తెలిపారు. ట్యాపింగ్‌పై రాజీ పడుతున్నారా అనే విషయానికి డీజీపీ సమాధానం చెప్పాలని రఘునందన్​ రావు డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి డీజీపీ, హోంమంత్రిపైనే అనుమానాలు : నిరంజన్ రెడ్డి

ఫోన్లు ట్యాపింగ్‌ జరిగినపుడు డీజీపీ, ఎస్‌ఐబీ చీఫ్‌ ఎవరున్నారు. ఫోన్ల ట్యాపింగ్‌లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. ట్యాపింగ్‌ పరికరాలు ఎవరు, ఎప్పుడు, ఎలా కొన్నారు. ఈ కేసులో కొందరినే బాధ్యులను చేయడం సరికాదు. ఇద్దరు ఏఎస్పీలను అరెస్టు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. కేసీఆర్, హరీశ్​రావు, వెంకట్రామి రెడ్డిలను నిందితులుగా చేర్చాలి. అసలు నిందితులను ముద్దాయిలుగా చేర్చకపోతే కేసు సంపూర్ణం కాదు. - రఘునందన్​ రావు, బీజేపీ నేత

ఫోన్​ ట్యాపింగ్​ కేసు - నిందితుల కస్టడీ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా

Last Updated : Mar 26, 2024, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details