తెలంగాణ

telangana

ETV Bharat / politics

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా - Mallu Ravi Contest Lok Sabha

Mallu Ravi Resigns to Special Representative : దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా చేశారు. ఎంపీ బరిలో నిలిచేందుకే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. వారం క్రితమే రాజీనామా లేఖను రేవంత్‌రెడ్డికి పంపినట్లు మల్లు రవి తెలిపారు.

Mallu Ravi Resigns to Special Representative
Mallu Ravi Contest Lok Sabha Constituency of Nagarkurnool

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 8:17 PM IST

Updated : Feb 23, 2024, 10:46 PM IST

Mallu Ravi Resigns to Special Representative :దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి పీసీసీ ఉపాధ్యక్షులు​ మల్లు రవి రాజీనామా చేశారు. నేడు జడ్చర్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తాను స్వయంగా వెల్లడించారు. నాగర్​కర్నూల్ ఎంపీ పదవికి పోటీ చేసేందుకే తాను, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జడ్చర్ల నియోజకవర్గంలో స్థానికులకు టికెట్ ఇప్పిచ్చి గెలిపించేందుకు సర్వశక్తుల కృషి చేశానని అన్నారు.

Mallu Ravi Contest Lok Sabha Constituency of Nagarkurnool :రాబోయే లోక్​సభ ఎన్నికల్లో(Lok Sabha Election) నాగర్​కర్నూల్ ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉంటానని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. నాగర్​కర్నూల్ లోక్​సభ టికెట్ విషయంలో కొందరు మల్లు రవికి దిల్లీలో అధికార ప్రతినిధి పదవి ఉందని, మళ్లీ ఎంపీ ఎందుకని అంటున్నారని, అందుకే తాను ఆ పదవికి గతంలోనే రాజీనామా చేశానన్నారు.

రాష్ట్రంలో ఆరు గ్యారంటీలే ఆలంబనగా - రేవంత్​ సర్కార్​ అడుగులు

"నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ సీటు ఇవ్వటానికి దిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఉదయ్​పూర్​ డిక్లరేషన్​ ప్రకారం అడ్డు వస్తుందని, ఆ పదవికి నేను రాజీనామా చేశాను. నా రాజీనామా పత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చి, మీరు ఈ పదవి వల్ల పార్లమెంట్​ సీటు ఇవ్వటానికి అడ్డువస్తే, మీరు నా రాజీనామాను అంగీకరించాలని కోరాను. అదేవిధంగా నాగర్​కర్నూల్​ సీటు ఇవ్వాలని కోరాను."-డా.మల్లు రవి, కాంగ్రెస్​ సీనియర్​ నేత

అందుకు సంబంధించిన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy), దిల్లీలో పెద్దలకు సమర్పించినట్లు ఆయన వివరించారు. తాను 1980 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి గెలుపునకు కృషి చేస్తున్నానన్నారు. ఇప్పుడు కూడా తాను నాగర్​కర్నూల్ నుంచి పోటీ చేయాలని పార్లమెంటు పరిధిలోని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కచ్చితంగా నాగర్​కర్నూల్ ఎంపీ బరిలో నుంచి పోటీలో నిలిచుంటున్నట్లు ఆయన తేల్చి చెప్పారు.

Congress Leader Mallu Ravi Comments on KCR :బీఆర్​ఎస్​ నేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఇటీవల హైదరాబాద్​లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ధ్వజమెత్తారు. తాజాగా జరిగిన అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుండగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకాకపోవడం ప్రజలను అవమానపర్చినట్లేనని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

ఈనెల 27న సాయంత్రం రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్​

Last Updated : Feb 23, 2024, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details