Mahabubnagar BRS MLC Candidate 2024 : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తరఫున పోటీకి నాగర్‌కుంట నవీన్ కుమార్ రెడ్డిని అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, నవీన్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. నందిగామ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి, గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఆయన బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో దిగనున్నారు.
Mahabubnagar Local Bodies BRS MLC Candidate Naveen Kumar :ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 4న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆరోజు నుంచి మార్చి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 12న నామినేషన్ల పరిశీలన, 14న నామినేషన్ల ఉప సంహరణ గడువుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్చి 28న పోలింగ్ జరగనుంది. ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు 2021 నవంబరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 2 స్థానాలకు నోటిఫికేషన్ పడింది. అప్పుడు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్అధికారంలో ఉండటం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అదే పార్టీకి చెందిన వారు కావడంతో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాయి.