Nara Lokesh on Container Vehicle at CM Camp Office:సీఎం జగన్ ఇంట్లోకి నిబంధనలు అతిక్రమించి వెళ్లిన కంటెయినర్ సంగతేంటని నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులు రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారని ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘనైనా కనిపించిందా అని ప్రశ్నించారు. పోలీసులు కళ్లెదుటే జగన్ నివాసంలోకి వెళ్లిన కంటెయినర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్ ప్రశ్నించారు. ఆ కంటెయినర్లో ఏముందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రెజిల్ సరకా, మద్యంలో మెక్కిన వేల కోట్లు కంటెయినర్లో తెచ్చారా అని నిలదీశారు. లండన్ పరారీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారా లేక ఏపీ సెక్రటేరియట్ దాచిన దొంగ ఫైళ్లు కంటెయినర్లో వచ్చాయా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు డీజీపీ సమాధానం చెప్పగలరా అని లోకేశ్ సవాల్ విసిరారు.
సీఎం క్యాంప్ ఆఫీసులోకి కంటెయినర్- ఎందుకొచ్చింది, ఏం తెచ్చింది? - Suspected Container Vehicle
తాయిలాలతో ఓటర్లను ఏమార్చే కుట్ర:ఓటమి భయంతోనే తాయిలాలిచ్చి ఓటర్లను ఏమార్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలని నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగో గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోదాములో పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు పట్టుకున్నారన్నారు.