Election Campaign in Telangana 2024: సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నిజామాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి జగిత్యాల జిల్లా బండలింగాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రామ్మోహన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. విశ్రాంతి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే రఘురామిరెడ్డిని గెలిపించాలని కోరారు.
Congress Election Campaign : మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొందరు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. చేరికను వ్యతిరేకరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుమారున్ని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు జానా రెడ్డి కోరారు.
ఎలక్షన్ వార్ - ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల దూకుడు - lok sabha elections 2024
BJP Election Campaign 2024: ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సత్తుపల్లిలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బీజేపీలో చేరిన పలువురు ఇతర పార్టీ నేతలకు కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లో జరిగిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.