తెలంగాణ

telangana

ETV Bharat / politics

అది జన జాతర కాదు - హామీల పాతర, అబద్ధాల జాతర సభ : కేటీఆర్ - KTR Tweet On Congress Party - KTR TWEET ON CONGRESS PARTY

KTR Tweet On Congress Party : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తుక్కుగూడలో నిర్వహించింది జన జాతర సభ కాదని, హామీల పాతర, అబద్ధాల జాతర సభ అని విమర్శించారు. సంక్షేమ పథకాలను సంక్షోభంలోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు అరచేతిలో స్వర్గం చూపించారని కేటీఆర్ మండిపడ్డారు.

KTR Tweet On Congress Party
KTR Tweet On Congress Party

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 11:57 AM IST

KTR Tweet On Congress Party :తుక్కుగూడలో నిర్వహించింది జన జాతర సభ కాదని, హామీల పాతర, అబద్ధాల జాతర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్​పై ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో హడావిడి చేశారు, ఇప్పుడు మళ్లీ న్యాయపత్రం అంటూ నమ్మిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సంక్షేమ పథకాల్ని (Welfare Scheme) సంక్షోభంలోకి నెట్టింది కాంగ్రెస్ అని కేటీఆర్ ఆరోపించారు.

KTR Tweet On Rahul Gandhi :కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగు నీరు లేక అన్నదాతలు (Farmers) పంటలు నష్టపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల (Debts) పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు నీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మోసాలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారనికేటీఆర్ తన ట్వీట్​లో వివిరించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణం కాంగ్రెస్ (Congress)​ అని కేటీఆర్ విమర్శించారు. కుల గణన (Caste Senses) పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు అని ఎద్దేవా చేశారు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ (Telangana) సమాజానికి అర్థమైపోయిందని కేటీఆర్ అన్నారు.

" రాహుల్​ గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా? తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు? నమ్మి ఓటేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా కాంగ్రెస్ నయవంచన చేస్తోంది. అసత్యాలతో అధికారంలోకి వచ్చి, అన్నదాతలను ఆత్మహత్యల పాలుజేస్తుంది. నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది. గ్యారెంటీలకు పాత రేసి, అసత్యాలతో జాతర చేస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు" - కేటీఆర్ ట్వీట్

"రాహుల్ గారు మా అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా? 200కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా? చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా ? డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా?" అని కేటీఆర్ తన ట్వీట్​లో ప్రశ్నించారు.

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ - ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్

KTR Tweet Today : 'గ్రామాల అభివృద్ధికి బీఆర్​ఎస్ సర్కార్ పెద్దపీట'

సీఎం కేసీఆర్ వల్లే ప్రతి ఇంటికి నీళ్ల కనెక్షన్ సాధ్యమైంది.. కేటీఆర్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details