KTR Fires on congress Government in Telangana: ఇప్పటివరకు రాష్ట్రంలో 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేయాలని గుర్తుచేశారు. హస్తం పార్టీని ఆగం చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఆ విషయంలో ఒక్క మాటా మాట్లాడరేం - రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారు : కేటీఆర్
KTR on Congress 60 Days Governance : మార్చి 17తో కాంగ్రెస్ సర్కార్(Congress Government) వంద రోజుల పాలన పూర్తి అవుతుందని ఆ లోపు 6 గ్యారంటీలను అమలు చేయకపోతే హస్తం పార్టీ మ్యానిఫెస్టోను రాష్ట్రవ్యాప్తంగా పంపిణి చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. 60 రోజుల పాలనలోనే కరెంట్ కోతలతో సర్కార్ పని తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS)ను గెలిపించాలని, కార్యకర్తలు అధైర్యపడవద్దని తెలిపారు. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దామని తెలిపారు.
ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి - సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
KTR Instructions to BRS Followers : రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) హైదరాబాద్‌లోని అభివృద్ధిని చూసి నగరవాసులు గులాబీ పార్టీని గెలిపించారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజలు తమకి రెండుసార్లు అవకాశం ఇచ్చారని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండేందుకు అవకాశం ఇచ్చారని అన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ఎప్పుడు ప్రారంభం చేస్తారని తెలంగామ ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
"కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. ఫ్రీ బస్సులతో మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారితో పాటు ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం సక్రమంగా అమలు చేయాలంటే కొత్త బస్సులను పెంచాలి. ఇప్పటి వరకు 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో డ్రైవర్లకు రూ.1000 ఇస్తామన్నారు. అలా కాకుండా ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇవ్వాలి. 100 రోజుల వరకు వేచి చూద్దాం. నెరవేర్చకుంటే ప్రజా ఉద్యమాలు చేద్దాం."- కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే 6 గ్యారెంటీల అమలట : కేటీఆర్
KTR React on Congress Meeting : కాంగ్రెస్ పార్టీని ఆగం చేయాలనే ఉద్దేశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. లంకె బిందెలను ఖాళీ కుండలని ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన తీరేనా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను తిడుతూ అనుచితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓపిక నశిస్తే తాము కూడా అదే పద్దతిలో మాట్లాడుతామని హెచ్చరించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మాట్లాడలేరని, పార్లమెంట్లో గళం వినిపించాలంటే కేసీఆర్ దళమే ఉండాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఆగం చేసే ఉద్దేశం మాకు లేదు కేటీఆర్ 'సర్పంచ్' పదవికి మాత్రమే విరమణ - ప్రజాసేవకు కాదు : కేటీఆర్