Jharkhand MLAs in Hyderabad: ఝార్ఖండ్‌లో రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం హేమంత్ సోరేన్ రాజీనామా చేయగా, కాసేపటి క్రితం చంపయీ సోరెన్ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 5న అసెంబ్లీలో బల నిరూపణ ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలలతో పాటు 50 మంది ఝార్ఖండ్ నాయకులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కాసేపటి క్రితం వారందరూ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం వీరందరినీ రెండు ఏసీ బస్సుల్లో శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌కు తరలించారు.
హైదరాబాద్ చేరుకున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు JMM ఎమ్మెల్యేలు! గవర్నర్ వద్దకు చంపయీ సోరెన్
Jharkhand Latest Political News: ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, జెేఎంఎం పార్టీలు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచిలో 12 ప్రాంతాలల్లో 8.5 ఎకరాలు భూమి ఆక్రమించుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై కేసు నమోదు కావడంతోపాటు అతనిపై మనీల్యాండరింగ్ కేసు నమోదైంది. దీంతో ఈ కేసుల్లో ఆయనను అరెస్టు చేయడంతో ఆయన సీఎం పదవికి గండం ఏర్పడింది. ఆయన రాజీనామా చేసిన తరువాత అక్కడ పూర్తి రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
గవర్నర్ ఆహ్వానం మేరకు జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకుల్లో జేఎంఎం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 42 మంది ఎవరికి ఉంటే వారికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. కాని ఇక్కడ కాంగ్రెస్, జేఎంఎంలకు కలిసి 45 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ పార్టీ, తమ ఎమ్మెల్యేలను చీల్చే అవకాశం ఉందని భావించిన రెండు పార్టీలు ముందు జాగ్రత్తగా 36 మంది ఎమ్మెల్యేలను రెండు ప్రత్యేక విమానాలల్లో హైదరాబాద్‌కు తరలించారు.
ఇక్కడ తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో సురక్షితంగా ఉంటుందని భావించి ఇక్కడికి తరలించినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, రోహిత్ చౌదరి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకులు మల్‌రెడ్డి రామిరెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డిలు ఈ ఎమ్మెల్యేలను పర్యవేక్షణ చేస్తున్నారు. ఝార్ఖండ్ నుంచి పిలుపు వచ్చే వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఝార్ఖండ్‌లో వీడిన ఉత్కంఠ- సీఎంగా చంపయీ సోరెన్, 10 రోజుల్లో బలపరీక్ష