తెలంగాణ

telangana

ETV Bharat / politics

సీఎంకు ధనసేకరణ మీద ఉన్న ధ్యాస ధాన్యం సేకరణపై లేదు : జీవన్​రెడ్డి - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

Jeevan Reddy Interesting Comments on CM Revanth Reddy : రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం చేసిందని బీఆర్​ఎస్​ నేత జీవన్​రెడ్డి ఆరోపించారు. కనీస మద్దతు ధర తగ్గించి అమ్మిందని ఆక్షేపించారు. తెలంగాణ రైతుల కష్టం దేశంలో కాంగ్రెస్​కు పోతోందని మండిపడ్డారు. జరిగే ఎన్నికల్లో 17 స్థానాల్లో బీఆర్​ఎస్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Jeevan Reddy on Paddy MSP Rate
BRS Leader Jeevan Reddy

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 7:15 PM IST

Jeevan Reddy Interesting Comments on CM Revanth Reddy: రాష్ట్రంలో రూ.1450 కోట్లు విలువైన వడ్ల కుంభకోణం జరిగిందని బీఆర్​ఎస్​ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. రూ.2183 కనీస మద్దతు ధర(MSP) ఉంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం రూ.1900లకే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందని అన్నారు. ఒక్కో క్వింటాల్ పై రూ.600 నష్టం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​, ఇతర రాష్ట్రాల వారికి టెండర్లు దక్కాయని, వాటి వివరాలు ఆర్టీఐ కింద అడిగితే ఇవ్వలేదని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో వడ్ల ఎగుమతి జరిగితే కాంగ్రెస్ హయాంలో దేశమంతా కరెన్సీ ఎక్స్​పోర్ట్ జరుగుతోందని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు.

తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎవర్నీ వదిలేది లేదు : రేవంత్​ రెడ్డి - REVANTH REDDY on paddy procurement

Jeevan Reddy on Paddy MSP Rate : సీఎంకు ధనసేకరణ మీద ఉన్న ధ్యాస ధాన్యం సేకరణపై లేదని జీవన్​రెడ్డి(Jeevan Reddy) ఆరోపించారు. రూ.1450 కోట్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటా ఎంత అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి సోదరులు, సుదర్శన్ రెడ్డి, జూపల్లి, రేవంత్ రెడ్డి వాటా ఎంత అని నిలదీశారు. ధాన్యం టెండర్ల వ్యవహారంపై సీబీఐ, ఈడీ విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కిషన్ రెడ్డితో సహా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని అనుమానం వ్యక్తం చేశారు.ధాన్యం కొనుగోళ్లఅంశంపై సీబీఐ, ఈడీకి లేఖ రాస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల కష్టం దేశంలో కాంగ్రెస్​కు పోతోందని తెలిపారు. రాష్ట్రంలో బోగస్ తప్ప రైతు భరోసా, బోనస్ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆర్​ఆర్ పన్ను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు రైతులకు నష్టం కలిగిస్తే - కఠిన చర్యలు తప్పవు : సీఎం రేవంత్ రెడ్డి - CM Tweets On paddy procurement

Jeevan Reddy Fire on CM Revanth Reddy :రాష్ట్రంలో నిత్యం కార్తీకదీపం సీరియల్ నడుపుతున్నారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఐఎన్​సీ అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అని అన్నారు. దిల్లీలో మోదీయిజం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిది రౌడీయిజమని ఆరోపించారు. 420 సీఎం కారాదని ఆకాంక్షించారు. కాంగ్రెస్​ ఇచ్చిన అన్ని హామీలు అమలు కాకపోయినా రైతులకు ఇచ్చినవైనా నెరవేర్చాలని కోరారు. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) 17 స్థానాలు గెలుస్తుందన్న విశ్వాసంతో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాను కేసీఆర్​తోనే ఉంటానని స్పష్టం చేశారు.

"రాష్ట్రంలో 1450 కోట్ల రూపాయల విలువైన వడ్ల కుంభకోణం జరిగింది. రాష్ట్ర రైతుల కష్టం దేశంలో కాంగ్రెస్​కు వెళ్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ 17 స్థానాలు గెలుస్తుంది. నాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. నేను కేసీఆర్​తోనే ఉంటాను."- బీఆర్​ఎస్​ నేత జీవన్ రెడ్డి

సీఎంకు ధనసేకరణ మీద ఉన్న ధ్యాస ధాన్యం సేకరణపై లేదు జీవన్​రెడ్డి

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరసనలు - వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ - Lok Sabha Elections 2024

ధాన్యం కొనుగోళ్లు దాటాలీ సవాళ్లు- ఇకనైనా అన్నదాతకు గిట్టుబాటు ధర లభించేనా? - Paddy Procurement In Telangana

ABOUT THE AUTHOR

...view details