Allu Arjun Appeal To Fans : సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు హీరో అల్లు అర్జున్ సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేధికగా అర్జున్ ఓ లేఖ విడుదల చేశారు. తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అర్జున్ తెలిపారు. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్జున్ కోరారు.
I appeal to all my fans to express their feelings responsibly, as always and not resort to any kind of abusive language or behavior both online and offline. #TeamAA pic.twitter.com/qIocw4uCfk
— Allu Arjun (@alluarjun) December 22, 2024
"నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్‌కు సూచిస్తున్నాను"- అల్లు అర్జున్ ట్వీట్
'22 ఏళ్లు కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారు' - బన్నీ కన్నీంటి పర్యంతం