Murthy Yadav On Irregularities in Visakha Dairy: విశాఖ డెయిరీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై మంత్రి నారా లోకేశ్‌కు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. రెండు వేల కోట్ల టర్నవర్తో ఉన్న విశాఖ డెయిరీ నేడు నష్టాలలో ఉందని, అప్పులు తీసుకునే పరిస్థితిలోకి దిగజారిందన్నారు. విశాఖ డెయిరీ సంస్థ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబం చిన్నగదిలి సర్వే నెంబర్ 13,21,26లో 7.96 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని అన్నారు. దీని విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.
విశాఖ డెయిరీ నుంచి కోట్ల రూపాయల నిధులు దోచేశారని ఆరోపించారు. ఆడారి రాజకీయంగా చేసే ప్రతి పని కోసం విశాఖ డెయిరీ నుంచి కోట్ల రూపాయలు నిధులు దోచేశారన్నారు. చివరికి సిద్ధం సభలకు విశాఖ డెయిరీ మజ్జిగ ప్యాకెట్లు పంచి డెయిరీ సొమ్ము వైఎస్సార్సీపీ పాలు చేశారని అన్నారు. వైఎస్సార్సీపీ సిద్ధం సభలకూ విశాఖ డెయిరీ సొమ్మునే వాడారన్నారు. మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో విశాఖ డెయిరీ పేరుతో 50 ఎకరాల భూమిని కొన్నారని వెల్లడించారు. విశాఖ డెయిరీ ఎంప్లాయిస్‌కి ఇల్లు కట్టిస్తామని ఒక్కొక్కరి దగ్గర నుంచి 86 వేల రూపాయలు వసూలు చేశారని తెలిపారు.