EX IAS PV Ramesh on AP Development : గుంటూరులో ఏపీ అభివృద్ధి కార్యాచరణపై జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా అభివృద్ధిపై దృష్టి సారించలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీల ఏర్పాట్లకు ప్రయత్నం జరగలేదని ఆరోపించారు. బటన్ నొక్కి డబ్బులు పంచితే వచ్చే ఓట్లు చాలని, ప్రగతిని పట్టించుకోలేదని పీవీ రమేశ్ విమర్శించారు.
రాష్ట్రాభివృద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు: పీవీ రమేశ్ - Jana Chaitanya Vedika on AP Develop
Discussion on AP Development in Guntur : వైఎస్సార్సీపీ సర్కార్ భూహక్కు చట్టం అనేక గందరగోళాలకు తావిచ్చిందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఆరోపించారు. బ్రిటిష్ కాలంలో తెచ్చిన భూహక్కు చట్టం ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం కొత్త సమస్యలకు తెర తీసిందన్నారు. అందులో కొంతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారని పీవీ రమేశ్ విమర్శించారు.
Jana Chaitanya Vedika on AP Development (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 13, 2024, 12:41 PM IST
వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూహక్కు చట్టం అనేక గందరగోళాలకు తావిచ్చిందని పీవీ రమేశ్ ఆరోపించారు. బ్రిటిష్ కాలంలో తెచ్చిన భూహక్కు చట్టం ఎంతో మెరుగ్గా ఉందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం కొత్త సమస్యలకు తెర తీసిందని ఆరోపణలు చేశారు. అందులో కొంతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారని పీవీ రమేశ్ ఆక్షేపించారు.