CBI Court on Jagan and Vijayasai Reddy Foreign Tour Petition :విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అక్రమాస్తుల కేసులో A1, A2లుగా ఉన్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరుగా సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వచ్చే నెలలో 20 రోజుల పాటు యూకే వెళ్లేందుకు అనుమతివ్వాలని కోర్టును జగన్ కోరారు. జగన్ అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. తిరిగి బుధవారం కోర్టు విచారణ చేపట్టగా జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. జగన్ పిటిషన్‌పై వాదనలు ముగియగా ఈనెల 27కు నిర్ణయం వాయిదా పడింది.
Vijayasai Reddy Foreign Tour Petition :సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. విజయ సాయిరెడ్డికి అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేయగా, ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30కి వాయిదా వేసింది.
సీఎం జగన్ విదేశీ పర్యటన పిటిషన్‌పై కోర్టులో విచారణ - అనుమతి ఇవ్వొద్దన్న సీబీఐ - CM Jagan Foreign Tour Petition
విదేశాలకు ఓకే సారి A1, A2లు : ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పర్యటనలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. మొన్నటి వరకు వరుసగా బెంగుళూరు ప్యాలెస్‌కు వెళ్లి వచ్చారు. తాజాగా అక్రమాస్తుల కేసులో A1, A2లుగా ఉన్న జగన్, విజయ్ సాయి రెడ్డి ఓకే సారి విదేశాలకు వెళ్లేందుకు పిటిషన్లు దాఖలు చేయడంపై వైఎస్సార్సీపీ శ్రేణుల్లో, రాజకీయ విశ్లేషకుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ : జగన్ అక్రమాస్తుల కేసులను వేగంగా విచారణ జరపాలంటూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులపై చేపట్టిన సుమోటో పిటిషన్‌పై విచారణ కూడా అదే రోజుకు వాయిదా వేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తామే సుమోటోగా విచారణ జరుపుతున్నందున, హరిరామ జోగయ్య పిల్‌ను మూసివేస్తామని ధర్మాసనం పేర్కొంది.
అవసరమైతే సుమోటో పిటిషన్ విచారణలో సహకరించవచ్చునని సూచించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తాజాగా కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు పత్రికల్లో చూశానని, వాటిని తదుపరి విచారణలో సమర్పించాక నిర్ణయం తీసుకోవాలని హరిరామ జోగయ్య తరఫున న్యాయవాది పొలిశెట్టి రాధాకృష్ణ కోరారు. స్పందించిన హైకోర్టు పిటిషన్లపై విచారణను సెప్టెంబరు 17కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు- సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలు ఆశ్చర్యంగా ఉన్నాయి: జస్టిస్ సంజీవ్ ఖన్నా - SC on Jagan Illegal Assets Case