ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

నాడు ప్రతిపక్ష నాయకులను ఈడ్చి పడేయమని ఆదేశించారు : మంత్రి అనిత - HOME MINISTER VANGALAPUDI ANITHA

మాజీ సీఎం జగన్​పై మంత్రి అనిత ఆగ్రహం - స్పీకర్ ద్వారా అధికారికంగా ఆదేశాలు ఇప్పించారని మండిపాటు

Home Minister Vangalapudi Anitha Fire on Jagan
Home Minister Vangalapudi Anitha Fire on Jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 3:53 PM IST

Home Minister Vangalapudi Anitha Fire on Jagan :నక్క తెలివితేటలతో జగన్ మోహన్ రెడ్డి నాడు ఎమ్మెల్యేలను ఇటు నుంచే అటు లాగేశాడని హోంమంత్రి వంగలపూడి అనిత దుయ్యబట్టారు. బూతే సిగ్గుపడేలా బూతులు తిట్టించాడని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను ఈడ్చి పడేయమని స్పీకర్ ద్వారా అధికారికంగా ఆదేశాలు ఇప్పించాడని మండిపడ్డారు. స్పీకర్ జోన్​లోకి వెళ్లిన అందరినీ సస్పెండ్ చేయించాడని దుయ్యబట్టారు. అయినా సాకులు చెప్పలేదు, నాలుగు పక్కలా చుట్టుముట్టి కాలకేయుల్లా మీద పడే ఉన్మాద గుంపుల మధ్యలోకి ఒక్కడిగా చంద్రబాబు నాడు వచ్చారని అన్నారు.

ప్రజల తరపున ఒక్కడై గొంతు విప్పారని, ప్రజా గళం బలంగా వినిపించారని అనిత గుర్తు చేశారు. అరెస్ట్ అయినా మొక్కవోని దీక్షతో ముందడుగు వేశారని కొనియాడారు. అదీ నిబద్ధత, అదీ ధైర్యం, అదీ సింహం సింగల్​గా రావడం అంటే అని అన్నారు. వాచీలో మూడు మీద ముల్లాడటం లేదు, ఇంటి బయట బెల్ ఆడటం లేదు, లోపల గాలాడటం లేదు అని పిల్లాటలు ఆడడం కాదని ఎద్దేవా చేశారు. ఎవరు సింహమో, ఎవరు మేకవన్నెపులో వేరే చెప్పాలా, ఇంకా డౌట్లు ఉన్నాయా అంటూ జగన్​కు అనిత సవాల్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details