MLC Janga Krishna Murthy's Disqualification Petition : తనపై ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయడంపై జంగా కృష్ణ మూర్తి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్‌ను అనర్హునిగా ప్రకటించారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరారు. ఎన్నికల అనంతరం మే 14న పిటిషనర్‌పై అనర్హత వేటు విధించారు. దీన్ని సవాల్ చేస్తూ జంగా కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్సార్సీపీలో సామాజిక న్యాయం నేతి బీర చందమే: జంగా కృష్ణమూర్తి - MLC Janga Krishna Murthy on YSRCP
మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ వర్గాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. పార్టీ మారిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సంవత్సరాల తరబడి వేటు వేయకుండా ఎమ్మెల్సీనైన తనపై వేటు వేయడమేంటని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. 2014 ఎన్నికలకు ముందు జగన్ తనను పొగుడుతూ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. గురజాల సభలో మాట్లాడిన జగన్.. తనకు అన్యాయం చేయనని చెప్పి కనీసం మాట్లాడే అవకాశం లేకుండా అనర్హత వేటు వేశారని కృష్ణమూర్తి పేర్కొన్నారు. బీసీ వర్గాలను ఎదగనీయకుండా చేయాలని వైఎస్సార్సీపీ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని అన్నారు.
వైఎస్సార్సీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు - నామమాత్ర పదవులిచ్చి నట్టేట ముంచారు: MLC జంగా
ఎన్నికల వేళ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి - MLC Janga Krishnamurthy Joined TDP