High Court Granted Bail to Pinnelli Ramakrishna Reddy:వైఎస్సాసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. మే 13వ తేదీన పోలింగ్ రోజు పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి, ఆ తర్వాత రోజు కారంపూడిలో విధ్వంసాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ వచ్చింది. పాస్ పోర్టు అప్పగించాలని, ప్రతివారం పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టాలని పిన్నెల్లికి హైకోర్టు షరతులు విధించింది. ఆయా కేసుల్లో ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి:సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు, అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్‌పై దాడి చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైనా దాడికి యత్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతోపాటు అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి.
దస్త్రాలకే పరిమితమైన బుడమేరు వంతెన- ఇంకా మోక్షం ఎప్పుడో? - Bridge Construction works delay