Harish Rao Demands on Congress Six Guarantees Implementation :పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచీ చూపి హామీల అమలు వాయిదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరిట అధికారమెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల కోడ్(Election Code) రాక ముందే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు నిండుతాయన్న ఆయన, అప్పటికి పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుందని తెలిపారు.
దావోస్‌కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు వెళ్లారు : హరీశ్‌రావు
ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమీక్షకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి సహా పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికలపై నేతలు, కార్యకర్తల నుంచి నేతలు అభిప్రాయాలు స్వీకరించారు.
BRS Activity For Parliament Elections 2024 :ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు, కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతున్నారన్నారు. ఉద్యమకారులు(Activists) మాట్లాడిన మాటలు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేశాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని, గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా? అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. 2009 లో పది సీట్లే వచ్చాయి, ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా? అని అన్నారు.
'కారు' సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలోనే హైస్పీడ్‌తో దూసుకొస్తుంది : కేటీఆర్