తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీకి గడ్డపారలు అవుతాయి : హరీశ్​రావు - Harish Rao Counter to CM Revanth - HARISH RAO COUNTER TO CM REVANTH

Harish Rao Counter on CM Words : సీఎం రేవంత్​ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్​రావు సెటైర్లు​ వేశారు. కేసీఆర్​ ఇంటిపై వాలిన కాకి కూడా తమ ఇంటిపై వాలోద్దన్న రేవంత్​, గద్దలను ఎత్తుకెళ్లారని ఎద్దేవా చేశారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి, వరంగల్​లో పోటీ చేసే కాంగ్రెస్​ అభ్యర్థులు గులాబీ నేతలు కాదా అని ప్రశ్నించారు.

Harish Rao Comments on BJP
Harish Rao Comments on Congress

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 10:10 PM IST

Harish Rao Comments on Congress : సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి హరీశ్​రావు కౌంటర్​ ఇచ్చారు. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి తమ ఇంటిపై వాలొద్దని సీఎం రేవంత్​ అంటున్నారని హరీశ్​రావు పేర్కొన్నారు. కాంగ్రెస్​ నుంచి పోటీ చేస్తున్న చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్​లో దానం నాగేందర్, మల్కాజిగిరి పట్నం సునీతారెడ్డి, వరంగల్ అభ్యర్థి కడియం కావ్య అంతకముందు బీఆర్​ఎస్​ పార్టీ వాళ్లు కాదా అని ప్రశ్నించారు. కాకులను వాలనీయను అని సీఎం రేవంత్​ గద్దలను ఎత్తుకెళ్లారని మండిపడ్డారు.

ఇవాళ సిద్దిపేట జిల్లాలోని జగదేవపూర్ మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీశ్​రావు పాల్గొని ప్రసంగించారు. దిల్లీలో ప్రధాని మోదీకి, ఇక్కడ సీఎం రేవంత్​కు మాటలెక్కువ, చేతలు తక్కువని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ దొడ్డిదారిలో వచ్చి గద్దె ఎక్కిన తరువాత ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీకి గడ్డ పారలు అవుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​ దేవుని మీద ప్రమాణాలు చేస్తున్నారని, కానీ రాజీనామా చేస్తానని చెప్పడం లేదని విమర్శించారు.

Harish Rao on Raghunandan Rao : కాంగ్రెస్​ వచ్చాక కల్యాణ లక్ష్మీ పేరిట తులం బంగారం ఏమోగానీ, లక్ష రూపాయలు కూడా ఇవ్వడంలేదని హరీశ్​రావు అన్నారు. ప్రజలు రూ.4 వేల పెన్షన్​ వస్తుందని ఆశపడి కాంగ్రెస్​ను నమ్మితే రెండు వేల రూపాయలు కూడా రావడం లేదని ఆరోపించారు. బీజేపీకి మాటలు ఎక్కువ మతలబు తక్కువ అని, ఆ పార్టీకి ఓటు వేస్తే ఆగమైపోతారని పేర్కొన్నారు. మెదక్​లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘనందన్​రావు, దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు చెప్పి ఆ ఎన్నికల్లో గెలిచారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనను తిరస్కరిస్తే 54 వేల ఓట్లతో ఓటమిపాలయ్యారని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు.

తనను మెదక్ ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని బీఆర్​ఎస్​ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తెలిపారు. తన పేరు మీద ట్రస్టును ఏర్పాటు చేసి రూ.100 కోట్లతో పార్లమెంట్​ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానన్నారు. కలెక్టర్​గా పనిచేసినప్పుడు ప్రజల మధ్య ఉన్నానని, తాను కూడా ఈ ప్రాంత అభివృద్ధికి భాగస్వామిని అయ్యానని అన్నారు.

'కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, మా ఇంటి మీద వాలొద్దని రేవంత్​ రెడ్డి మట్లాడారు. మాటలు ముద్దుగా చెబుతావు చేసే చేష్టలు సక్కగా లేవు. ఆయన ఇంటి మీద వాలిన కాకి మీ ఇంటిమీద వాలనీయను అని అన్నావు కాదా. మరే చేవెళ్ల అభ్యర్థి ఎవరు? మల్కాజిగిరి సునీతారెడ్డి ఎవరు? వరంగల్​ అభ్యర్థ కడియం కావ్య ఎవరు?'- హరీశ్​రావు, మాజీ మంత్రి

తన ఇంటిపై కాకులను వాలనీయను అని రేవంత్‌రెడ్డి గద్దలను ఎత్తుకెళ్లారు : హరీశ్​రావు

కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకు ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లే : హరీశ్‌రావు - Harish Rao Comments on Congress

ABOUT THE AUTHOR

...view details