తెలంగాణ

telangana

ETV Bharat / politics

తెలంగాణను తెచ్చింది సిద్దిపేటనే - సిద్దిపేట లేకుంటే తెలంగాణ లేదు : హరీశ్​రావు - Harishrao Comments on cm revanth - HARISHRAO COMMENTS ON CM REVANTH

Harishrao Comments on Congress : తెలంగాణను తెచ్చింది సిద్దిపేటనేనని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేసిన సవాల్​ను మళ్లీ స్వీకరిస్తున్నానని అన్నారు. సిద్దిపేటలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Harishrao Fires on Cm Revanth Reddy
Harishrao Comments on Congress (etv bharat)

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 4:30 PM IST

Harishrao Fires on Cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సవాల్​ను మళ్లీ స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ సీనియర్​ నేత హరీశ్​రావు అన్నారు. పంద్రాగస్టు వరకు ఆరు గ్యారంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ చేయండని తెలిపారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్​రెడ్డిని తానే స్వయంగా సిద్దిపేటకు ఆహ్వానించి, శాలువా కప్పుతానని స్పష్టం చేశారు. సీఎం నియమించిన ప్రెస్​ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్​రెడ్డి వద్ద ఇద్దరం రాజీనామా లేఖలు ఉంచుదామని పేర్కొన్నారు. సిద్దిపేటలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

రేవంత్​ రెడ్డి రాజీనామా లేఖ ప్రెస్​ అకాడమీ ఛైర్మన్​కు ఇచ్చిన 10 నిమిషాల్లోనే తన లేఖను పంపిస్తానని మాజీ మంత్రి హరీశ్​రావు వివరించారు. స్పీకర్​ ఫార్మెట్​లో రాజీనామా లేఖ అందజేస్తానని అన్నారు. పంద్రాగస్టు వరకు ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా ఆమోదం చేయించుకుంటానని హరీశ్​రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్​ బాండ్​ పేపర్​ బౌన్స్​ అయిందని, హామీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానన్నారు. ఈ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు.

సీఎంగా రేవంత్​ రెడ్డి సిద్దిపేటకు ఏం చేయలేదో చెప్పండని హరీశ్​రావు అడిగారు. సిద్దిపేటకు రైలు, గోదావరి నీళ్లు, పోలీస్​ కమిషనరేట్​, మెడికల్​, ఫార్మసీ కాలేజ్​ లాంటి ఎన్నో విద్యాలయాలను బీఆర్​ఎస్​ తెచ్చిందని హర్షించారు. సిద్దిపేట అభివృద్ధి కాలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబితే జనాలు నమ్మరని హితవు పలికారు. సిద్దిపేట ప్రజల చైతన్యమే తెలంగాణ పార్టీని పుట్టించిందన్నారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, ఆ ఉద్యమమే లేకుంటే ఈనాడు తెలంగాణ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ లేకపోతే రేవంత్​ రెడ్డి సీఎం అయ్యేవారు కాదని విమర్శించారు.

లోక్​సభ ఎన్నికలో ఓట్లు వేయించుకోవడానికి కొత్త నాటకం : ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతే కొడంగల్​ చౌరస్తాలో రేవంత్​ రెడ్డి ముక్కు నేలకు రాస్తారా అంటూ హరీశ్​రావు ప్రశ్నించారు. ఆనాడు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్​ ప్రామిస్​లా అంటూ ధ్వజమెత్తారు. ఈ విధంగా పార్లమెంట్​ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి లేని అప్పులు, అంకెల గారడీ చూపిస్తూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. పెట్టుబడిదారుల్లో అనుమానం రేకెత్తించే విధంగా రేవంత్​ రెడ్డి మాటలు ఉన్నాయని, దీని వల్ల రాష్ట్రం నష్టపోతుందని ఆవేదన చెందారు.

"సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనాలు నమ్మాలా? అన్నింటికి మించి సిద్దిపేట ప్రజల చైతన్యమే ఈ తెలంగాణను పుట్టించింది. ఈరోజు రేవంత్​ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది సిద్దిపేట పుణ్యమే. ఈరోజు సిద్దిపేటకు, కేసీఆర్​కు రేవంత్​ రెడ్డి రుణపడి ఉండాలి. సీఎం అభివృద్ధి మొత్తం మెదక్​ జిల్లాకే పరిమితం అని చెప్పి, ఇప్పుడు లేదని ఎందుకు అంటున్నారు? సీఎం రేవంత్​ రెడ్డి ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తానని చెబుతున్నారు. దాన్ని తాను స్వాగతిస్తున్నాను. తాను ఇచ్చిన చాలెంజ్​ను ఇప్పటివరకు రేవంత్​ రెడ్డి స్వీకరించలేదు."- హరీశ్​రావు, బీఆర్​ఎస్​ నేత

తెలంగాణను తెచ్చింది సిద్దిపేటనే - సిద్దిపేట లేకుంటే తెలంగాణ లేదు : హరీశ్​రావు (etv bharat)

హామీల అమలుపై రేవంత్‌ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రావాలి : హరీశ్‌రావు - Harish Rao Fires On Cm Revanth

హరీశ్​రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకో - కేసీఆర్​లాగా మాట తప్పొద్దు : రేవంత్​ రెడ్డి - Revanth Reddy Speech in Warangal

ABOUT THE AUTHOR

...view details