First List of Telangana BJP Lok Sabha Candidates :బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా(BJP MP Seats First List)ను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు ఉండగా తొలి విడతలో 195 స్థానాలకు లోక్‌సభ(Lok Sabha) అభ్యర్థులను వెల్లడించింది. ఈ తొలి జాబితాలో తెలంగాణకు సంబంధించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 17లోక్‌సభ స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, నిజామాబాద్ - ధర్మపురి అరవింద్, కరీంనగర్ - బండి సంజయ్, జహీరాబాద్ - బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ - భరత్ ప్రసాద్, మల్కాజిగిరి - ఈటల రాజేందర్, భువనగిరి - బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ - డాక్టర్ మాధవి లత, చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. బీజేపీ సిట్టింగ్‌ల్లో ముగ్గురికి మరోసారి అవకాశం దక్కగా ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఈ స్థానం నుంచి కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా లేక సిట్టింగ్ వ్యక్తికే మరోసారి అవకాశం దక్కుతుందా అనేది వేచి చూడాలి.
BJP Lok Sabha 2024 : వారం రోజుల క్రితం బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములుకు బదులు అతని కుమారుడు భరత్ కుమార్‌కు టికెట్ దక్కింది. రాములు విజ్ఞప్తి మేరకే అధిష్ఠానం భరత్ ప్రసాద్‌కు టికెట్ ఇచ్చింది. ఇక రెండు రోజుల క్రితం బీజేపీ గూటికి చేరిన బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు మళ్లీ జహీరాబాద్ నుంచే టికెట్ దక్కింది. ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని మాధవీ లతకు కేటాయించారు.