Sharmila Fire on Jagan : హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి.. హత్య జరిగి ఐదేళ్లయినా ఇంత వరకూ హత్యచేసిన, చేయించిన వాళ్లకు శిక్షపడలేదు. అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రాత్రి చివరి క్షణం వరకు చిన్నాన్న వైఎస్సార్సీపీ కోసమే పని చేశారని గుర్తు చేశారు. తన చిన్నాన్న చావుతో ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ, సునీత అని తెలిపారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు.
సిద్దం సభలకు రూ 600 కోట్లు- ఉద్యోగాలు ఇవ్వలేకపోయి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారు: షర్మిల
సాక్షిలో పైన వైఎస్ ఫొటో, కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం జరుగుతోందని పేర్కొన్న షర్మిల.. జగనన్న ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదని అన్నారు. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి అని హితవు పలికారు. వైఎస్ తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా?, వైఎస్ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరు ఏం చేశారు? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదనే ఆవేదన ఐదేళ్లుగా ఉందని వాపోయారు.